టీటీడీలో బోర్డు నిర్ణయాలపై గోప్యత ఎందుకు? | - | Sakshi
Sakshi News home page

టీటీడీలో బోర్డు నిర్ణయాలపై గోప్యత ఎందుకు?

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వాసుయాదవ్‌

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: టీటీడీలో పాలనాపర మైన అంశాలపై పాలకమండలి సమావేశాల్లో చర్చించి తీసుకున్న నిర్ణయాలను గోప్యంగా ఉంచడంపై అనుమానాలకు తావిస్తోందని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వాసుయాదవ్‌ అన్నారు. శుక్రవారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. టీటీడీలో పరిపాలన అంతా అయోమయంగా మారిందన్నారు. పాలకమండలిలో తీసుకునే నిర్ణయాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంలో అధికార యంత్రాంగానికి భయమెందుకని ప్రశ్నించారు. లోగుట్టు వెనుక మర్మమేమిటో చెప్పండి మహాశయా అని నిలదీశారు. పాలకవర్గం సమావేశంలో తీసుకునే ప్రతి నిర్ణయం, తీర్మానం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ వెబ్‌సైట్‌లో 1993 నుంచి 2025 వరకు జరిగిన బోర్డు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలన్నీ అందుబాటు ఉండడంతోపాటు అందరూ పరిశీలించుకునే అవకాశం దక్కిందన్నారు. అయితే 2025 డిసెంబర్‌ నాటికి బీఆర్‌ నాయుడు చైర్మన్‌గా ఏర్పడిన పాలకవర్గం నిర్వహించిన బోర్డు సమావేశాల నిర్ణయాలను అదే నెలాఖరు వరకు మాత్రమే వెబ్‌సైట్‌లో పెట్టారన్నారు. ఆ తరువాత 2026 మే వరకు జరిగిన సమావేశాల నిర్ణయాలను ఇంతవరకు వెబ్‌సైట్‌లో పొందుపరచలేదన్నారు. ఏక పక్షంగా తీసుకున్న ఆ నిర్ణయాలు ఎక్కడ అందరికి తెలిసిపోతాయనే భయంతో పెట్టడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు.గత ఐదు నెలల్లో జరిగిన బోర్డు సమా వేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందరూ చూసుకునే విధంగా పెట్టాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ తరుఫున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర యువజన విభా గం కార్యదర్శి మల్లం రవికుమార్‌, సోషల్‌ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి షణ్ముగం రాయల్‌, నగర పార్టీ నేతలు కోటి, రమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement