తిరుమల: తిరుమలలో రాజకీయ ప్రచారానికి పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ శుక్రవారం శ్రీవారి ఆలయం ఎదుట రాజకీయ ఛాయలు కనిపించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయం సమీపంలో ఓ ఎమ్మెల్యేకి చెందిన వాహనంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫొటో కారులో కనిపించడంతో అక్కడున్న భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు రాజకీయ జెండాలు, పార్టీ గుర్తులు, నాయకుల చిత్రాలు పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో ఇలాంటి వాహనం ఆలయ పరిసరాలకు ఎలా చేరిందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య భక్తులపై కఠిన నిబంధనలు అమలు చేసే అధికారులు ప్రజాప్రతినిధుల వాహనాల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. టిటిడి విజిలెనన్స్ సిబ్బంది తనిఖీల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కేవలం పేరుకే జరుగుతున్నాయా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.


