యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ జాబ్‌మేళాలో యువతను బురిడీ కొట్టిస్తే సహించం. జాబ్‌మేళాలో చిన్న చిన్న ఉద్యోగాలు ప్రైవేటు సంస్థల్లో కల్పించి, అవి మేమే ఇచ్చామని లెక్కలు చెప్పడం దారుణం. హామీలు గుప్పించిన ప్రకారం 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాల్సిందే. జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన వారు సైతం తక్కువ జీతం కావడంతో వెనుతిరుగుతున్నారు. కొందరికి ఇప్పటకీ నియామకపత్రాలు అందకపోవడం శోచనీయం. – శివశంకర్ నాయక్,
జీఎన్‌ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి
కుచ్చుటోపీ పెడితే సహించం
చంద్రబాబు అండ్ కో ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిందే. నిరుద్యోగ భృతి మాటే ఎత్తడం లేదు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి జాబ్ మేళాలు నిర్వహించి ఇవే ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టడం దారుణం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ద్వారా 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి తీరాలి. లేని పక్షంలో నిరుద్యోగ యువతతో కలసి పోరాడుతాం.
– గార్లపాటి శ్రీధర్,
ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా అధ్యక్షులు, తిరుపతి
ఇదిగో అదిగో అంటున్నారు
నేను ఎంకాం చేశాను. గత ఏడాది తిరుపతిలో ప్రభుత్వ ఆద్వర్యంలో తిరుపతిలో జరిగిన జాబ్‌మేళాకు హాజరయ్యాను. అకౌంటెంట్‌గా ప్రముఖ కంపెనీ ప్రతినిధులు సెలక్ట్ చేశారు. ప్రశంసాపత్రాలు అందించారు. ఇంకా ఉద్యోగ నియామకపత్రం అధికారికంగా ఇవ్వలేదు. ఇదిగో అదిగో అంటూ చెబుతున్నారు. జాబ్‌మేళాలో ఇచ్చే ఉద్యోగాలు కేవలం రూ.15వేల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయాలి.
– ప్రదీప్, ఎంకామ్, తిరుపతి


