వరసిద్ధి వినాయకుడి కటాక్షంతో మా గ్రామం ఈ రోజు సుభిక్షంగా ఉంది. కరోనా కష్టకాలంలో కూడా ఊరును బాగు చేయాలని పనిచేశాం. అప్పుడు కూడా పంచాయతీ ఆదాయ వనరులను పెంచాం. వచ్చే ఆదాయంతో పంచాయతీని అన్ని హంగులతో తీర్చిదిద్దాలని ప్రణాళికతో ముందుకు వెళ్లాం. కరోనా సమయంలో టోల్‌గేట్, సంత, కాంప్లెక్స్ తదితరాల ద్వారా ఆదాయం పెరిగింది. దీంతో అన్ని రకాలుగా పంచాయతీని అభివృద్ధి చేశాం. మా పంచాయతీకి కేంద్ర స్థాయిలో గుర్తింపు లభించి అవార్డు రావడం సంతోషంగా ఉంది.
–శాంతిసాగర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, కాణిపాకం
ఇంకా అభివృద్ధి చేస్తాం
పంచాయతీని పక్కా ప్రణాళికతో ముందుకు నడిపిస్తాం. ఇంకా అభివృద్ధి చేస్తాం. ప్రధానంగా కాంప్లెక్స్, కల్యాణ మండపం నిర్మాణం చేపట్టాలనే ప్రణాళిక ఉంది. ఆ రకంగా పనులు చేపట్టి.. పంచాయతీకి మరింత ఆదాయం పెంచేలా చూస్తాం. కేంద్ర బృందం చేసిన సూచనలు కూడా పాటించి.. పంచాయతీలో మరిన్ని మార్పులు చేస్తాం. – ప్రమీల,
పంచాయతీ కార్యదర్శి, కాణిపాకం


