మహిళల ఆర్థికాభివృద్ధికి వార్షిక ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధికి వార్షిక ప్రణాళిక

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

తిరుపతి రూరల్‌ : మహిళల ఆర్థికాభివృద్ధికి వార్షిక ప్రణాళిక ఎంతో అవసరమని డీఆర్‌డీఏ పీడీ టీఎన్‌.శోభన్‌బాబు తెలిపారు. తిరుపతి రూరల్‌ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి వార్షిక కార్యాచరణ ప్రణాళికపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విజన్‌ బిల్డింగ్‌లో భాగంగా ప్రతి సంఘం, పంచాయితీ స్థాయిలో మహిళలు తమ లక్ష్యాలను సాధించేందుకు ముఖ్యమైన 9 అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పశుసంపద, చెడు అలవాట్ల నిర్మూలన, వీధి విద్యుత్‌ దీపాలు, డ్రైనేజీ, బాల్య వివాహాల నివారణ, సామాజిక భద్రత వంటి అంశాలపై వివరించారు. అనంతరం వార్షిక రుణాలు, జీవనోపాధి ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం వెంకటేష్‌, ఏపీఎంలు నాగేశ్వరరావు, మునయ్య, నరసింహులు, సీసీలు, ఎల్‌సీసీలు, అకౌంటెంట్లు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement