సౌదీలో పునబాక మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సౌదీలో పునబాక మహిళ ఆత్మహత్య

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

● మృతదేహం అప్పగించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి

పెళ్లకూరు: మండలంలోని పునబాక గ్రామానికి చెందిన ఉయ్యాల భాస్కరయ్య, తయారమ్మ దంపతుల కుమార్తె కోనేటి మమత(36) బుధవారం సౌదీలోని జుబేల్‌ ప్రాంతంలో ఉంటూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో తిరుపతికి చెందిన కోనేటి చెంగయ్య (విశ్రాంత ఎస్‌ఐ) చిన్న కుమారుడు కోనేటి కృష్ణకి మమతను ఇచ్చి వివాహం చేశారు. వీరు శ్రీకాళహస్తిలోని ఇందిరానగర్‌లో నివాసం ఉండేవారు. వీరికి కోనేటి రూపేష్‌, కోనేటి లోహిత్‌ కుమారులు ఉన్నారు. 2012లో కృష్ణకి సౌదీలోని సాట్రాప్‌ పెట్రో కెమికల్‌ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం రావడంతో భార్యభర్తలిద్దరు సౌదీలో నివాసం ఉంటున్నారు. తిరుపతిలో ఉన్న కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి వివాదం నెలకొనడంతో మమత మనస్తాపానికి గురై భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అయితే మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చి తమకు అప్పగించేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement