– నాగలాపురంలో ఘటన
నాగలాపురం: ఉపాధి కూలీ పాముకాటుకు గురైన ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. నాగలాపురం నటరాజగుంటకు చెందిన ప్రేమ (42) ఉపాధి పనులకు వెళ్లింది. అక్కడ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పాము కాటేయడంతో తోటి కూలీలు వెంటనే ఆమెను స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి డాక్టర్లు నగరి ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. నగరిలో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్టు సమాచారం.


