తిరుపతి అర్బన్: జాతీయ పురస్కారాన్ని అందుకోనున్న పంచాయఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ బుధవారం కలెక్టరేట్‌లో అభినందించారు. చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లె పంచాయలో సౌరశక్తి పర్యావరణ పరిక్షణలో క్లైమేట్ స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దడంతో కేంద్ర అవార్డు వచ్చిన నేపథ్యంలో రూ. కోటి అవార్డుకు ఎంపిక చేశారు. దీంతో జూన్ 3న ఢిల్లీలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవితోపాటు పంచాయతీ ఉద్యోగులకు ఓ మొక్కను బహుకరించి, అభినందించారు.
రైల్వేస్టేషన్‌లో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు
సూళ్లూరుపేట: స్థానిక రైల్వేస్టేషన్‌లో బుధవారం చైన్నె సెంట్రల్ రైల్వేపోలీస్ ప్రత్యేక నిఘా విభాగం బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ అధికారులు, సిబ్బంది తనిఖీలు చేశారు. చైన్నె నుంచి సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ వరకు అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వారిని, వారి వద్ద లగేజీ బ్యాగ్‌లను పరిశీలించారు. విజయవాడ నుంచి చైన్నె వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్, చైన్నె నుంచి అహమ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లు రావడంతో వాటి నుంచి దిగిన ప్రయాణికుల్లో అనుమానాస్పదంగా ఉన్న వారిని ఆపి లగేజీలు పరిశీలించారు.
తుడా సెక్రటరీగా శ్రీకాంత్ బాబు పదవీకాలం పొడిగింపు
తిరుపతి తుడా: తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ సెక్రటరీగా డాక్టర్ శ్రీకాంత్ బాబు పదవి కాలాన్ని మరో ఏడాది కాలం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పశు సంవర్థక శాఖ అధికారిగా ఉన్న శ్రీకాంత్ బాబును డిప్యూటేషన్‌పై తుడా సెక్రటరీగా గత ఏడాది నియమితులయ్యారు. ఈ కాలం పూర్తవడంతో ఆయన్ని మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పేయదూడల
అందాల పోటీలు
కలువాయి(సైదాపురం): మండల కేంద్రంలోని పశువైద్యశాలలో పశుసంవర్థకశాఖ ఏడీ గురు జయంతి, ఎగ్జిక్యూటీవ్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం పేయి దూడలకు అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ దూడలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అనంతరం పాడిరైతులకు ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. పాడి రైతులకు పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం నట్టల నివారణ మందులు, విటమిన్లు, లవణ ద్రావకాలను ఉచితంగా పంపిణీ చేశారు.
చిన్నరామాపురంలో
ఏనుగుల హల్‌చల్
చంద్రగిరి: మండలంలోని చిన్నరామాపురం సమీపంలో ఉన్న మొక్కలతోపు వద్ద బుధవారం రాత్రి ఏనుగుల గుంపు రోడ్డుదాటుతూ బీభత్సవం సృష్టించాయి. రోడ్డు దాటుతున్న క్రమంలో ఏనుగుల అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనాచోదకుడిపై దాడికి యత్నించాయి. దీంతో వాహనాచోదకులు బైక్‌ను వదిలి పరుగులు తీశారు. ఏనుగులు ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ప్రాణభయంతో పరుగులు తీసిన యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. మొక్కలతోపు వద్ద ఏనుగుల గుంపు ఉన్నట్లు తెలుసుకున్న ప్రయాణికులు సుమారు గంటకు పైగా వాహనాలను దూరంగా ఉంచుకున్నారు.


