వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

తిరుపతి క్రైమ్‌: తిరుపతి అర్బన్‌ పరిధిలోని కుమ్మరిమిట్టకు చెందిన బుద్దారెడ్డి అయ్యప్ప ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. కుమ్మరిమిట్టకు చెందిన బుద్దారెడ్డి అయ్యప్ప (38)కు మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ నెల 8వ తేదీ ఉదయం పనికి వెళ్లిన అయ్యప్ప, సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 9.45 గంటల సమయంలో భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో గొడవకు దిగాడు. అనంతరం, ఇంట్లో ఉన్న చీరతో పైకప్పు హుక్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన భార్య తులసి, చుట్టుపక్కల వారి సహాయంతో అతడిని ఆటోలో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై తులసి (30) గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement