శ్రీసిటీ (వరదయ్యపాళెం): భారత వాణిజ్య పరిశ్రమల సంఘం (అసోచామ్)2026–27కు ఏర్పాటైన అనుబంధ సెజ్– పారిశ్రామిక మండళ్ల జాతీయ మండలి చైర్మన్‌గా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి నియమితులయ్యారు. సహ చైర్మన్‌లుగా ఎల్.బి.సింఘాల్ (మాజీ నోయిడా సెజ్ కమిషనర్), హితేందర్ మెహతా (సెంట్రం లీగల్ మేనేజింగ్ పార్టనర్, సెజ్‌లపై పుస్తక రచయిత) నియమితులయ్యారు. అసోచామ్ అధ్యక్షుడు నిర్మల్ కె.మిందా ఈ నూతన మండలి ఏర్పాటును ప్రకటించారు. ఈ సందర్భంగా డా.సన్నారెడ్డి మాట్లాడుతూ, సెజ్‌లను పెట్టుబడులు, ఎగుమతులు, పారిశ్రామిక వృద్ధికి చోదక శక్తులుగా నిలబెట్టే దిశగా, ప్రభుత్వం, పరిశ్రమలతో కలిసి మండలి పనిచేస్తుందన్నారు. సెజ్ పథకం రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ సమయంలో ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి అనుగుణంగా కొత్త సమన్వయం అవసర మని డా. సింఘాల్ అన్నారు. సెజ్ 2.0 విధాన రూపకల్పనలో ఈ మండలి కీలక పాత్ర పోషిస్తుందని మెహతా పేర్కొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్:ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
నేటి నుంచి ఒంటిపూట బడి
తిరుపతి అర్బన్:వేసవి నేపథ్యంలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ ఆదేశించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 7.45 నుంచి మఽ ద్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే పదోతరగతి పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ఒంటి పూట బడులు ఏప్పిల్ 24 వరకు కొనసాగుతాయ ని వివరించారు. రెండు సెషన్లలో తరగుతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


