భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చింతామణి కి చెందిన వేణు, రమేష్, వంశీకృష్ణ భాకరాపేట వైపు వస్తున్నారు. రొంపిచర్ల మండలం గానుగచింత దాసరిగూడెంకి చెందిన తుపాకుల సుబ్బరామయ్య(70) చిన్నగొట్టిగల్లు వద్ద జాతీయ రహదారి దాటుతున్న సమయంలో ద్విచక్రవాహనం వృద్ధుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బరామయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు మృతుడు తుపాకుల సుబ్బరామయ్య గొడుగులు కుట్టుకుంటూ భాకరాపేటలో నివసిస్తున్నట్టు తెలిపారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న గాయపడ్డారు. వారిని చిన్నగొట్టిగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపారు.


