రైలు కింద పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి మృతి

Mar 10 2026 7:12 AM | Updated on Mar 10 2026 7:12 AM

పాకాల: స్థానిక పాకాల రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే పోలీసులు కథనం మేరకు.. పాకాల భారతంమిట్ట 7వ క్రాస్‌కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కె.విశ్వనాథనాయుడు(75) ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిత్తూరు రైల్వే ఎస్‌ఐ ధర్మేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరికి ఐదేళ్ల జైలు

తిరుపతి లీగల్‌ : ఎర్రచందనం చెట్ల నరికివేత, అక్రమ రవాణా కేసుల్లో వేర్వేరుగా ఇద్దరి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్‌ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన గోవిందన్‌ పొన్నుస్వామి 2016లో చందనం చెట్లు నరుకుతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో నిందితుడికి జైలు శిక్షతోపాటు రూ.6లక్షల జరిమానా విధించారు. అలాగే చిన్నగొట్టిగల్లు మండలం, దేవరకొండ, గొల్లపల్లె దళితవాడకు చెందిన మధుసూదన్‌ అలియాస్‌ మధు అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తూ 2017లో పట్టుబడ్డాడు. ఈ మేరకు నిందితుడికి జైలు శిక్ష విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement