11 నుంచి విజయయాత్ర | - | Sakshi
Sakshi News home page

11 నుంచి విజయయాత్ర

Mar 10 2026 7:12 AM | Updated on Mar 10 2026 7:12 AM

తిరుపతి కల్చరల్‌ : శృంగేరి శ్రీశారదా పీఠాధీశ్వర శంకరాచార్య నృసింహ భారతీ తీర్థ మహాస్వామి 168వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విధుశేఖర భారతి మహాస్వామి ఈనెల 11 నుంచి నగరంలో విజయయాత్ర నిర్వహించనున్నారని మఠం సభ్యులు కుప్ప విశ్వనాథ శర్మ, జీఎల్‌.కుమార్‌ తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ 12,14వ తేదీలలో ఉదయం 11.30 గంటలకు మహాస్వామి దర్శనం, పాదపూజ ఉంటుందన్నారు. మఠం నిర్వాహకులు కె. కృష్ణమూర్తి, జి.శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

పరికరాలపై అవగాహన అవసరం

తిరుపతి సిటీ : ఆధునిక పరికరాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని ఎస్వీయూ వీసీ నర్సింగరావు తెలిపారు. సోమవారం రుసా సహకారంతో హోంసైన్స్‌ విభాగం వారు ఫుడ్‌సైన్స్‌లో అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ అనాలిస్‌ అండ్‌ అప్లికేషన్‌ అనే అంశంపై ఐదురోజుల వర్క్‌షాప్‌ నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ఆహార భద్రత, నాణ్యత కోసం అధునాతన పరికరాలు అవసరమని వివరించారు. రెక్టార్‌ అప్పారావు, రిజిస్ట్రార్‌ భూపతినాయుడు, వర్క్‌షాప్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కేవీ సుచరిత, ప్రొఫెసర్‌ మంజుల, అనూరాధ, స్వరూప, హేమ పాల్గొన్నారు.

రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌గా సుస్మిత బాధ్యతల స్వీకరణ

రేణిగుంట: స్థానిక రిజిస్ట్రేషన్‌ కార్యాలయ నూతన సబ్‌ రిజిస్ట్రార్‌గా ఎస్‌ ఆర్‌ సుస్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించి, ఒక సంవత్సరం శిక్షణ కోసం తిరుపతి జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్‌ నియామకాల్లో ఆమెకు సబ్‌ రిజిస్ట్రా ర్‌గా పోస్టింగ్‌ వచ్చింది. కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా బాలాజీ విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement