సీసీఆర్‌హెచ్‌తో మహిళావర్సిటీ ఎంఓయూ
తిరుపతి రూరల్: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఇ న్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్)తో శ్రీపద్మా వతీ మహిళా యూనివర్సిటీ శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఇంటిగ్రేటివ్ నెట్‌వర్క్ ఫా ర్మకాలజీ ఆఫ్ హోమియోపతి మెడిసిన్స్ ఫర్ ది ట్రీట్‌మెంట్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్’ అనే సహకార పరిశోధన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి ఈ ఒ ప్పందం చేసుకున్నట్టు వీసీ ఉమ తెలిపారు. ఇక పై ఈ రెండు సంస్థల మధ్య శాసీ్త్రయ ధ్రువీకర ణ, అనువాద పరిశోధన, విద్యామార్పిడిని ప్రో త్సహించడమే లక్ష్యంగా పరిశోధనలు చేయనున్నట్టు తెలిపారు. కౌన్సిల్ తరఫున తిరుపతిలోని క్లినికల్ రీసెర్చ్ యూనిట్ (హోమియోపతి) ఆఫీ సర్ డాక్టర్ జీఆర్ రెడ్డి, కోల్‌కతాలోని రీసెర్చ్ ఆ ఫీసర్ (ఫార్మకాలజీ) జీవీ నరసింహకుమార్ సీ సీఆర్‌హెచ్ ప్రధాన కార్యాలయంలో రీసెర్చ్ ఆఫీ సర్ (ఫుడ్ సైన్స్) డాక్టర్ దిగ్విజయ్ వర్మలు హాజ రై సంతకం చేయగా వర్సిటీ తరఫున వీసీ వి.ఉమ, రిజిస్ట్రార్ ఆర్.ఉష సంతకం చేశారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపా ర్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువా రం అర్ధరాత్రి వరకు 62,074 మంది స్వామిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భ క్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది.


