ఏపీ ఆర్‌సెట్‌లో ఎస్వీయూ విద్యార్థికి ప్రథమస్థానం
తిరుపతి సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఆర్ సెట్ – 2025లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఎస్వీయూ విద్యార్థి ఎస్ నరేంద్ర ప్రథమ స్థానం సాధించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో మూరుమూల ప్రాంతమైన వై రామాపురం గ్రా మానికి చెందిన ఆయన ఎస్వీయాలో పీజీ వి ద్యను అభ్యసించారు. ఒక వైపు తన చదువు తో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి వర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా పనిచేయ డం విశేషం. ఈ సందర్భంగా ఆయనకు పలువురు విద్యార్థి నేతలు అభినందనలు తెలిపారు.
రైలు పట్టాలపై మృతదేహం హుస్సేన్‌దిగా గుర్తింపు
నాయుడుపేటటౌన్: మండలంలోని పండ్లూరు సమీపంలో రైలు పట్టాలపై పడి ఉన్న మృతదే హం పట్టణంలోని ముస్లిం వీధికి చెందిన షేక్ హుస్సేన్(33)గా బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం గుర్తించారు. కొంత మంది ట్రాన్స్ జెండర్లు తన కొడుకును హత్య చేసి రైలుపట్టా ల పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతుడి తండ్రి మాబుబాషా ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. గురువారం పండ్లూరు సమీపంలో రైలు పట్టాలపై పడి ఉన్న మృతదేహం ఘటనకు సంబంధించి గూడూరు రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశా రు. అయితే నాయుడుపేట పోలీసులు హుస్సే న్ కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తూ శుక్రవారం కేసు నమోదు చేసి దర్యా ప్తు చేసేందుకు ముందుకు వచ్చారు. గురువా రం రాత్రి మృతుడి సోదరుడు ఉస్మాన్ ట్రాన్స్ జెండర్లు హుస్సేన్‌ను కిడ్నాప్ చేశారని, వారే హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పో లీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా హుస్సేన్‌ను కిడ్నాప్ చే సిన కొంత మంది ట్రాన్ జెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం
తిరుపతి క్రైం : తిరుపతిలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లిస్ సర్కిల్ సమీపంలో ఉన్న గరుడ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. తాతయ్యగుంటకు చెందిన ఆదం ద్వారక (23) తిరుచానూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ద్వారక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ఉన్న మరో యువకుడు స్వల్ప గాయాలతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స మాచారం. ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రుయా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ఈస్ట్ ఎస్‌ఐ హేమాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీటీడీ ఆధీనంలోకి అభయ అనుగ్రహ వెంకన్న ఆలయం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగలోని శ్రీ అభయ అ నుగ్రహ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసుకునే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కే. నరసింగరావు, గ్రామస్తులు ఆలయానికి సంబంధించిన రికార్డులను టీటీడీ అధికారులకు అందజేశారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వా మి ఆలయ సముదాయంలో ఈ ఆలయాన్ని చేర్చారు. టీటీడీ సూపరింటెండెంట్లు జ్ఞానప్రకాష్, ముని కుమార్, రాజేష్, ఆలయ అధికా రులు మహేష్, రవికుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఏపీ ఆర్‌సెట్‌లో ఎస్వీయూ విద్యార్థికి ప్రథమస్థానం


