ఐఐటీలో తిరుత్సవ్–2026 ప్రారంభం
● నూతన ఆవిష్కరణలకు ఐఐటీ కేంద్ర బింధువు కావాలన్న వక్తలు ● సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులు ● మూడు రోజులపాటు ఘనంగా సంబరాలు
ఏర్పేడు : తిరుపతి ఐఐటీలో శుక్రవారం రాత్రి తిరుత్సవ్–2026 పేరిట నిర్వహించిన టెక్నో కల్చరల్ ఫెస్ట్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐఐటీ డీన్ శశిధర్ గుమ్మా ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథులుగా సినీ నటీనటులు మృణాల్ ఠాకూర్, అడివి శేష్ విచ్చేశారు. ఐఐటీ డీన్ శశిధర్ గుమ్మా మాట్లాడుతూ సంవత్సరం, సంవత్సరానికి విభిన్నతను చాటుకుంటూ విద్యార్థులే నిర్వహించే ఈ ఉత్సవం ఈ సారి అద్వితీయంగా ప్రారంభమైందన్నారు. అతిథులకు సన్మానం, జ్ఞాపికల బహూకరణ చేశారు. అంతకుముందు ఉదయం పైరేట్స్ ఆఫ్ ఐఐటీ, చాంబర్ ఆఫ్ సీక్రెట్స్, లీప్స్ అండ్ బీట్స్, మినీ ఆక్షన్ పోటీలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. మధ్యాహ్నం హూడీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నవ్వులు పూయించింది.
డెకాయిట్ సినిమా మొదటి సాంగ్ రిలీజ్
తిరుపతి ఐఐటీలో జరుగుతున్న తిరుత్సవ్–2026 ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన డెకాయిట్ మూవీ హీరో, హీరోయిన్లు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ తాము నటిస్తున్న డెకాయిట్ సినిమా మొదటి సాంగ్ ‘రూబరో...’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో ఐఐటీ పీఆర్వో చమన్ మెహతా, తిరుత్సవ్ ఈవెంట్ హెడ్ ప్రణతి పాల్గొన్నారు.
ఐఐటీలో తిరుత్సవ్–2026 ప్రారంభం
ఐఐటీలో తిరుత్సవ్–2026 ప్రారంభం
ఐఐటీలో తిరుత్సవ్–2026 ప్రారంభం
ఐఐటీలో తిరుత్సవ్–2026 ప్రారంభం


