రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి

Feb 28 2026 7:07 AM | Updated on Feb 28 2026 7:07 AM

రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి

రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించండి

తిరుపతి అర్బన్‌: రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్రరెడ్డి ఆదేశించారు. నూతనంగా సూళ్లూరుపేట ఆర్డీఓగా తిరుపతి కలెక్టరేట్‌లో పనిచేస్తున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ దేవేంద్రరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న అనంతరం మర్యాద పూర్వకంగా శుక్రవారం కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చిన్న చిన్న రెవెన్యూ సమస్యలకు సైతం పలువురు కలెక్టరేట్‌కు వస్తున్నారన్నారు. అలాంటి పరిస్థితులు లేకుండా తహసీల్దార్‌, ఆర్డీఓ పరిధిలోనే వాటికి పరిష్కారం చూపించేలా పనిచేయాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement