ప్రైవేటుకు సై.. | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు సై..

Feb 24 2026 7:52 AM | Updated on Feb 24 2026 7:52 AM

ప్రైవ

ప్రైవేటుకు సై..

86 సేవలున్న రవాణాశాఖ నిర్వీర్యం ఎల్‌ఎల్‌ఆర్‌ ఒక్కటే రవాణాశాఖ చేతిలో.. ఎఫ్‌సీలు కూడా ప్రైవేట్‌ నిర్వాహకుల చేతికే వాహనచోదకులు లేక వెలవెలబోతున్న ఆర్టీఏ కార్యాలయాలు

గతంలో ఎవరైనా వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్టీఏ) కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసేవారు. దీంతో కొనుగోలుదార్లు అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను మొదటి దశలో ప్రైవేటు రంగానికి అప్పగించారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్‌ వద్దనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగేలా చేశారు.

స్కూల్‌ బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్‌నెస్‌ పరీక్షలు(ఎఫ్‌సీ) నిర్వహించాలి. రవాణా శాఖ విధుల్లో ఇది అత్యంత కీలకమైనది. రవాణాశాఖ అధికారులు వాహన ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసేటప్పుడు ఏ చిన్న లోపం ఉన్నా రిజక్ట్‌ చేసేవారు. తద్వారా వాహనాల కండీషన్‌ సక్రమంగా ఉండి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేవారు. కానీ ఈ అధికారాన్ని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు(ఎంవీఐ)లు నుంచి తప్పించి, ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణాధికారం కూ డా రవాణా శాఖ అధికారులకు లేకుండా చేశారు. దీంతో వాహనాల కండీషన్‌ సరిగ్గా లేకపోయినా ప్రైవేట్‌ ఏజెన్సీ వారు ముడుపులు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేయడంతో ప్రమాదాలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్‌సీల ప్రక్రియను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాచగున్నేరి వద్ద ఏర్పాటు చేశారు.

ఇక మిగిలింది డ్రైవింగ్‌ లెసెన్స్‌ జారీ దీనిని కూడా డిస్ట్రిక్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌కు అప్పగించి, వారి ద్వారానే 25 రోజుల పాటు శిక్షణ ఇచ్చి లైసెన్సులు జారీ చేయించే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు గతంలో వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల పర్మిషన్లను కార్యాలయ పరిపాలనాధికారి స్థాయిలో మాన్యువల్‌గా చేసి జారీ చేసేవారు. ఈ సేవలను ఆన్‌లైన్‌ చేసి, అవసరమైన సమయానికి రుసుం చెల్లిస్తే కార్యాలయానికి వెళ్లకుండానే వీటిని జారీ చేస్తున్నారు.

వాహనాల్లో సామర్థ్యానికి మించి సరుకులు లోడ్‌ చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పర్మిట్ల వంటి వాటిపై రవాణా అధికారులు గతంలో చెక్‌ పోస్టుల వద్ద తనిఖీ చేసేవారు. ఇప్పుడు ఆ చెక్‌ పోస్టులు ఎత్తివేశారు.

ఇలా రవాణా శాఖ అధికారాలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేయడం లేదా కుదించడంతో అధికారులు కేవలం రోడ్లపై వాహనాలను ఆపి, తనిఖీ చేసి, చలానాలు రాయడం, ఇతరత్రా సేవలకు పరిమితమవుతున్నారు. ఈ కారణంగా శాఖపై ఆసక్తి సన్నగిల్లుతోంది.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏర్పాటైన రవాణాశాఖపై బాబు సర్కారు ప్రై‘వేటు’ వేసింది. ఇప్పటికే ఈ శాఖలో ఒక్కే ఒక సేవ మినహా అన్నీ ప్రైవేటు పరమయ్యాయి. దీంతో రవాణాశాఖ నిబంధనలు గాలికి కొట్టుకుపోనున్నాయి. కాసుల గలగలలతో ఏదైనా సాధ్యం కానుంది. ప్రజలపై పెనుభారం పడనుండగా.. రవాణా చట్టాలకు తూట్లు పడనున్నాయి. రోడ్డు ప్రమాదాలు మరిన్ని పెరగనున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
డబ్బులిస్తే వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు

వాహనదారులు లేక వెలవెలబోయిన తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయం

శ్రీకాళహస్తి రాచగన్నేరి వద్ద ప్రై వేటు ఏజెన్సీ వాళ్లు ఏర్పాటు చేస్తున్న వాహన ఫిట్‌నెస్‌ పరీక్షల సెంటర్‌(ఏటీసీ)

ప్రభుత్వ సంస్థలు ప్రైవేటుపరమే బాబు లక్ష్యం

జిల్లాలో వాహనాల వివరాలు

ప్రయాణికుల బస్సులు 3,551

స్కూల్‌ బస్సులు 1,105

గూడ్స్‌ క్యారియర్లు 19,427

మోటార్‌ కార్లు 23,541

త్రీ వీలర్‌ 47,388

అగ్రికల్చర్‌ ట్రాక్టర్లు 10,858

కమర్షియల్‌ ట్రాక్టర్లు 9,802

ఇతర వాహనాలు 9,012

తిరుపతి మంగళం : రవాణాశాఖ కార్యాలయాలు వాహనచోదకులతో నిత్యం కళకళలాడుతుండేవి. అయితే క్రమేణా రవాణా శాఖ సేవలు ఒక్కొక్కటి గా ప్రైవేటుపరమైపోయాయి. దీంతో నేడు వెలవెల బోతున్నాయి. రవాణాశాఖలో మొత్తం 86 సేవలకుగానూ ఎల్‌ఎల్‌ఆర్‌ మినహా మిగిలిన సేవలన్నీ అప్పన్నంగా ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్లిపోయాయి. మిగిలిన ఎల్‌ఎల్‌ఆర్‌ను కూడా ప్రైవేటుకు కట్టబెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తద్వారా ప్రైవేటు నిర్వాహకుల ఇష్టారాజ్యం కానుంది. వాహనచోదకులకు సేవలందించడంలో ఏదొక కొరివి పెడుతూ కాసులు దండుకుంటున్నారు. వావాన సేవ నిబంధనలను గాలికొదిలేశారు. అంతా ప్రైవేట్‌పరం కా వడంతో ఒకప్పుడు వందలాది మంది వాహనచోదకులతో కళకళలాడిన తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంతోపాటు జిల్లాలోని రవాణా కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి.

ప్రైవేట్‌ చేతుల్లోకి..

86 సేవల్లో 85 ప్రైవేటుపరం

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసి చేతులు దులుపుకోవాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో ఎంతో కీలకమైన రవాణాశాఖలోని 86 సేవల్లో 85 సేవలు ప్రైవేటుపరం చేశారంటే అర్థమవుతుంది. వాహన సామర్థ్యం, రవాణా నిబంధనలను వాహనచోదకులంతా పాటించేలా చూస్తూ ప్రమాదాలను అరికట్టడంలో రవాణాశాఖ కీలకపాత్ర పోషిస్తోంది. అటువంటి శాఖను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి నిర్వీర్యం చేశారు. అదే తరహాలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు, మంగళంలోని ఆర్టీసీ డిపోను ప్రైవేటు పరం చేసేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేయాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉన్నారు. దీంతో ప్రజలు ఎంత నష్టపోతారో, కష్టపడతారోనన్న ఆలోచన కనిపించడం లేదు.

ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లు (ఏటీఎస్‌)లను ఇప్పటికే ఇతర జిల్లాల్లో ఏర్పాటు చేసింది. వాటి నిర్వాహకులు కావాల్సిన సర్టిఫికెట్‌ ఆధారంగా నగదు డిమాండ్‌పై ఆటో యూనియన్లు, రవాణా కార్మిక సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే అధికారం రవాణాధికారులకు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తిరుపతి జిల్లా మొత్తానికి శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి వద్ద ఒకే ఒక్క ఏటీఎస్‌ ఏర్పాటు చేయగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న వారు తమ వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల కోసం సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో వారు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు.

ప్రైవేటుకు సై.. 1
1/3

ప్రైవేటుకు సై..

ప్రైవేటుకు సై.. 2
2/3

ప్రైవేటుకు సై..

ప్రైవేటుకు సై.. 3
3/3

ప్రైవేటుకు సై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement