శాస్త్రోక్తంగా శాంతి అభిషేకాలు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా శాంతి అభిషేకాలు

Feb 24 2026 7:52 AM | Updated on Feb 24 2026 7:52 AM

శాస్త

శాస్త్రోక్తంగా శాంతి అభిషేకాలు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఏకాంత సేవతో ముగిశాయి. సోమవారం పంచమూర్తులు, పరివార దేవతలకు శాంతి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబతో పాటు వినాయకస్వామి, శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప, త్రిశూలం, పరివార దేవతల ఉత్సవమూర్తులకు వేదపండితులు వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్‌ కొట్టే సాయి ప్రసాద్‌, ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా శాంతి అభిషేకాలు1
1/1

శాస్త్రోక్తంగా శాంతి అభిషేకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement