పోలీస్ గ్రీవెన్స్‌కు 105 అర్జీలు
తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీ లు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఎన్‌ఎస్‌యూలో నక్షత్ర వనం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ ప్రాంగణంలోని ఔషధ వనం విస్తరణలో భాగంగా నక్షత్ర వనాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సోమవారం వీసీ జీఎస్‌ఆర్ కృష్ణ మూర్తి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్టార్ గార్డెన్ (నక్షత్ర వనం)ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025లో ఏప్రిల్‌లో వర్సిటీ ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో ప్రారంభించిన ఔషధి వనం విజయవంతంగా కొనసాగుతోందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఔషధివనం విస్తరణ ద్వారా మరిన్ని ఔషధ మొక్కలను చేర్చనున్నట్లు తెలిపారు. జ్యోతిష్యం, ఆయుర్వేదాన్ని సమన్వయం చేసే ‘‘నక్షత్ర వనం’’ను సైతం ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలదత్తాత్రేయ, పి శ్వేత, ప్రొఫెసర్ జేబీ చక్రవర్తి, ఆర్ లక్ష్మీనారాయణ, చిరంజీవి, అధ్యాపకులు పాల్గొన్నారు.
తిరుమలలో చలువ పందిళ్లు
తిరుమల: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భ క్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేప ట్టారు. భక్తులు క్యూలో వేచి ఉండే సమయంలో ఎండ ప్రభావం తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో చలో పందిళ్లు (తాత్కాలిక షెడ్లు) ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండడంతో, ముఖ్యంగా వేసవి కాలంలో సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులు నిర్ణయించారు. క్యూ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలు, నాలుగు మాడ వీధులు తదితర ప్రాంతాల్లో పందిళ్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా, వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు. భక్తులు ఈ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఎండ నుంచి రక్షణ కల్పించడం వల్ల వేచి ఉండే సమయం సౌకర్యంగా మారిందని తెలిపారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 105 అర్జీలు
పోలీస్ గ్రీవెన్స్‌కు 105 అర్జీలు


