టిప్పర్‌ ఢీకొని ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని ఇద్దరి మృతి

Feb 22 2026 7:00 AM | Updated on Feb 22 2026 7:00 AM

టిప్ప

టిప్పర్‌ ఢీకొని ఇద్దరి మృతి

సైదాపురం: చిన్ననాటి నుంచి స్నేహితులైన ఇద్దరు యువకుల్ని టిప్పర్‌ రూపంలో మృత్యువు కబళించింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. సైదాపురం మండలంలోని చాగణం గ్రామానికి చెందిన బంకాపూరి శశి(22), అదే గ్రామానికి చెందిన తోటకూరు సంతోష్‌(22) ఇద్దరు స్నేహితులు. చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి స్కూటర్‌పై చాగణం నుంచి సైదాపురం గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఏపీ 39సీ 5247 నంబర్‌ టిప్పర్‌ వారి వాహనాన్ని ఢీకొంది. దీంతో స్కూటర్‌ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందజేసి, వారిని వాహనంలో తరలిస్తుండగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాపూరు సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ క్రాంతికుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

పనులకు వెళ్లి....అనంతలోకాలకు ...

సంతోష్‌, శశి ఇద్దరు కలిసి రోజు కట్టెల లోడింగ్‌ పనులకు వెళ్లి తమ కుటుంబాలకు వారు చెందోడు వాదోడుగా ఉండేవారు. శనివారం ఉదయం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. సరదాగా సైదాపురం గ్రామానికి స్కూటర్‌పై వెళుతున్న సమయంలో మృత్యువు వారిని కబలించింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ వాహనం కోసం పోలీసులు మమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

టిప్పర్‌ ఢీకొని ఇద్దరి మృతి 1
1/3

టిప్పర్‌ ఢీకొని ఇద్దరి మృతి

టిప్పర్‌ ఢీకొని ఇద్దరి మృతి 2
2/3

టిప్పర్‌ ఢీకొని ఇద్దరి మృతి

టిప్పర్‌ ఢీకొని ఇద్దరి మృతి 3
3/3

టిప్పర్‌ ఢీకొని ఇద్దరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement