ఏపీ పీజీసెట్‌–26కు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఏపీ పీజీసెట్‌–26కు దరఖాస్తుల ఆహ్వానం

Feb 22 2026 6:59 AM | Updated on Feb 22 2026 6:59 AM

ఏపీ ప

ఏపీ పీజీసెట్‌–26కు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి సిటీ: ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ పీజీసెట్‌–26కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీజీసెట్‌ కన్వీనర్‌, వర్సిటీ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీ సెట్‌కు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దర ఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏదేని డిగ్రీ పూర్తి చేసిన, ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు అర్హులని తెలిపారు. పీజీ సెట్‌ దరఖాస్తులకు వచ్చేనెల 9వ తేదీతో గడువు ముగుస్తుందని, ప్రవేశ పరీక్షలు మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయని ఆ ప్రకటనలో తెలిపారు.

ఆదివారమూ హల్‌టికెట్ల జారీ

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈనెల 26వ తేదీ నుంచి జరగనున్న ఇయర్లీ ప్యాటర్న్‌ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఉద యం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లో హల్‌టికెట్ల జారీ కొనసాగుతుందని కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. డీన్‌ ప్రొఫెసర్‌ సురేంద్రబాబు, వీసీ నర్సింగరావు ఆదేశాల మేరకు అభ్యర్థుల సౌకర్యార్థం ఈ వెసులుబాటు కల్పించామని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని హాల్‌టికెట్లను పొందాలని సూచించారు.

శ్రీసిటీలో మాజీ డీజీపీ

శ్రీసిటీ(సత్యవేడు): మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎం.మాలకొండయ్య శనివారం శ్రీసిటిని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాగతం పలికి శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతిని వివరించారు. శ్రీసిటీ విజన్‌, ప్రణాళిక, అమలు తీరును ప్రశంసించిన డా. మాలకొండయ్య, దేశంలో ఆదర్శ పారిశ్రామిక కేంద్రంగా శ్రీసిటీ నిలుస్తుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ

విమాన సర్వీసులపై సమీక్ష

రేణిగుంట: విమానాశ్రయంలో కిడ్స్‌ జోన్‌, ఫ్లెబ్రరీ, ఉచిత వైఫై సదుపాయాలు ఏర్పాటు చేశారు. వీటిని కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌ నాయుడు, యూనియన్‌ మినిస్టర్‌ మురళీధర్‌ మోహోల్‌, ఏఏఐ చైర్మన్‌ విపిన్‌ కుమార్‌, కార్యదర్శి సమీర్‌ కుమార్‌ సిన్హా తదితరులు ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయ అభివృద్ధి పనులపై సమీక్షించారు. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపే విషయంపై చర్చించారు. కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్‌ భూమి నాథన్‌ పాల్గొన్నారు.

ఏపీ పీజీసెట్‌–26కు దరఖాస్తుల ఆహ్వానం 1
1/1

ఏపీ పీజీసెట్‌–26కు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement