జలపాతంలో మునిగి చైన్నె వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

జలపాతంలో మునిగి చైన్నె వాసి మృతి

Feb 22 2026 7:00 AM | Updated on Feb 22 2026 7:00 AM

జలపాతంలో మునిగి చైన్నె వాసి మృతి

జలపాతంలో మునిగి చైన్నె వాసి మృతి

రేణిగుంట: మామండూరు వద్ద జలపాతంలో మునిగి చైన్నెవాసి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చైన్నెకి చెందిన శ్రీనివాసన్‌, అతని స్నేహితుడు మణి కంఠన్‌ (27) ఇద్దరూ చైన్నెలోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. విహార యాత్ర కోసం చైన్నె నుంచి బైక్‌పై బయలుదేరిన వారు శనివారం మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ప్రవేశ టికెట్లు తీసుకుని జలపాతం వద్దకు వెళ్లారు. మణికంఠన్‌ ఈత కొట్టేందుకు జలపాతం నీటిలోకి దిగినప్పుడు అనుకోకుండా సుమారు 8 అడుగుల లోతు గుంటలో మునిగి పోయాడు. మణి కంఠన్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానిక ప్రజల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై రేణిగుంట అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement