ప్రస్తుతం కేన్సర్‌ వార్డు వివరాలు | - | Sakshi
Sakshi News home page

ప్రస్తుతం కేన్సర్‌ వార్డు వివరాలు

Feb 22 2026 6:59 AM | Updated on Feb 22 2026 6:59 AM

ప్రస్

ప్రస్తుతం కేన్సర్‌ వార్డు వివరాలు

2002లోనే రుయాలో కేన్సర్‌ వైద్యం కనుమరుగు

గత ప్రభుత్వంలో రుయాలో

పునరుద్ధరించిన వైఎస్‌ జగన్‌

2021లో కేన్సర్‌ విభాగ వైద్య

అధ్యాపకుల నియామకం

2024 ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రారంభం

నేడు రేడియోథెరపీ బంకర్‌ ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం

విస్తరించని సూపర్‌ స్పెషాలిటీ సేవలు

ఏటా పీజీ సీట్లు కోల్పోతున్న వైనం

రోజువారీ ఓపీలు 35

అడ్మిషన్లు 12

సర్జరీలు నెలకు 20

వార్డు బెడ్ల సామర్థ్యం 40

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మెడికల్‌ అంకాలజీ : డాక్టర్‌ రవి శంకర్‌

రేడియో అంకాలజీ : డాక్టర్‌ చండీప్రియ

సర్జికల్‌ ఆంకాలజీ: డాక్టర్‌ వికాస్‌ శంకర్‌

పీజీ వైద్య విద్యార్థులు: లేరు

పేదల పెద్దాస్పత్రి రుయా.. ఇది సీమకే తలమానికం.. సామాన్యుల పాలిట సంజీవని.. ఈ ఆస్పత్రిలో అన్ని విభాగాలు ఉన్నాయి.. అయితే ఆస్పత్రిలోని కేన్సర్‌ వార్డుకు ఎప్పుడో ‘చంద్ర’గ్రహణం పట్టింది. అది వీడుతున్న దశలో కాలకూటమి కాటేసింది. దీంతో కేన్సర్‌ విభాగం విస్తరణకు నోచుకోలేకపోయింది. ఫలితంగా పేదలకు ఖరీదైన కేన్సర్‌ వైద్యం అందని దైన్యం ఏర్పడింది. ఇదంతా కాలకూటమి కాటుతోనేనని రోగులు నిట్టూర్చుతున్నారు.

కేన్సర్‌ విభాగాన్ని

పునరుద్ధరించిన వైఎస్‌ జగన్‌

నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 2021లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశా లల్లో అన్ని విభాగాలకు దశలవారీ అధ్యాపకుల నియామకాలు చేపట్టారు. కాగా కేన్సర్‌ విభాగంలో వైద్య పరికరాలకు ఫంక్షన్‌ నిర్వహించకపోవడంతో నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాం 2002లో రుయాలో కేన్సర్‌ వైద్యం కనుమరుగు అయ్యింది. ఇక అప్పటి నుంచి 2021 వరకు రుయాలో కేన్సర్‌ విభాగమే లేకుండా పోయింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత వైద్యరంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వందలాది వైద్య అధ్యాపకుల నియామకాలు చేపట్టారు. పేదలకు అత్యాధునిక వైద్య అందించేందుకు అవసరమైన వైద్య పరికరాలు సమకూరుస్తూ వచ్చారు. ఈ క్రమంలో రుయా కేన్సర్‌ విభాగానికి చికిత్స చేపట్టారు. కేన్సర్‌ విభాగ వైద్య అధ్యాపకుల నియామకాలతో 2021 చివరిలో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. 2024 ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో మెడికల్‌, సర్జికల్‌, రేడియో అంకాలజీ విభాగంలో పూర్తిస్థాయి వైద్య సేవలను ప్రారంభించారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నా, పీజీ వైద్య సీట్లు తీసుకురావాలన్నా, రేడియో తెరఫీ బంకర్‌ ఉంటేనే సాధ్యమవుతుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారు. రుయాలో బంకర్‌ ఏర్పాటుకు నాటి ప్రభుత్వం అడుగులు వేసింది. అనూహ్యంగా నాటి ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో బంకర్‌ ఏర్పాటు ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా బంకర్‌ ఏర్పాటుకు అడుగు పడడం లేదు. 2002లోనూ రుయా కేన్సర్‌ విభాగానికి నాటి సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ కేన్సర్‌ వైద్యంతోపాటు పీజీ సీట్లను అందిపుచ్చుకోవాలంటే తక్షణం రేడియాలజీ బంకర్‌ ఏర్పాటు అనివార్యం.

తిరుపతి తుడా: నగరంలోని రుయాస్పత్రి అభివృద్ధిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఎస్వీ మెడికల్‌ కళాశాలలో కేన్సర్‌ విభాగంలో నియామకాలు చేపట్టకపోవడం, రుయా ఆస్పత్రిలో కేన్సర్‌ వార్డుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రోగులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందకపోవడంతోపాటు ఏటా 15కు పైగా పీజీ వైద్యవిద్య సీట్లను కోల్పోతున్నారు. రుయా అధికారులు అనేకసార్లు మౌలిక సదుపాయాల అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులు లేవని, ఇలాంటి ప్రతిపాదనలతో రావద్దంటూ ప్రభుత్వ పెద్దలు రుయా అధికారులకు చురకలంటిస్తున్నారు. దీంతో చేసేది లేక ఉన్న సౌకర్యాలతో వైద్యం అందిస్తూ మమ అనిపిస్తున్నారు.

బంకర్‌ ఏర్పాటుపై నిర్లక్ష్యం

కేన్సర్‌ విభాగానికి సూపర్‌ స్పెషాలిటీ స్థాయి రావాలంటే ఆస్పత్రిలో రేడియాలజీ బంకర్‌ అనివార్యం. ఏఈఆర్‌బీ అనుమతులతో బంకర్‌ను నిర్మిస్తే ఎస్వీ వైద్య కళాశాలలో పీజీ సీట్లు పెరుగుతాయి. తద్వారా పేద రోగులకు క్యాన్సర్‌ విభాగంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుతుంది. రేడియాలజీ బంకర్‌లో లీనియర్‌ ఆక్సిలేటర్‌, సిటీ సిములేటరీ, బ్రోకీ తెరఫీ తదితర అత్యాధునిక వైద్యవ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. బంకర్‌ నిర్మించాలంటే రూ.5 కోట్లతో అంచనా వేశారు. అలానే అందులో పై తెలిసిన రేడియాలజీ వైద్య పరికరాల కోసం రూ.20 కోట్లు అవుతుంది. మొత్తంగా రేడియాలజీ బంకర్‌ వ్యవస్థ ఏర్పాటుకు రూ.25 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనేకసార్లు బంకర్‌ అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కేన్సర్‌ విభాగ విస్తరణకు

చంద్రగ్రహణం

వైద్య విద్యార్థులకు భారీ నష్టం

కేన్సర్‌ విభాగంలో ప్రొఫెసర్ల నియామకం, రేడియాలజీ బంకర్‌ ఏర్పాటు చేస్తే సూపర్‌ స్పెషాలిటీగా విస్తరిస్తుంది. తద్వారా రోగులకు అత్యాధునిక కేన్సర్‌ చికిత్స అందించడంతోపాటు పీజీ వైద్యవిద్య సీట్లు పొందవచ్చు. ప్రస్తుతం సూపర్‌ స్పెషాలిటీ స్థాయి లేకపోవడంతో మెడికల్‌ అంకాలజీ, రేడియో అంకాలజీ, సర్జికల్‌ అంకాలజీ విభాగంలో మొత్తంగా ఏడాదిలో 15 సీట్లకు పైగా పీజీ వైద్యవిద్య సీట్లను వైద్యులు కోల్పోతున్నారు. పీజీ వైద్యం పొందే వైద్యులు సీట్లు లేకపోవడంతో ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. కేన్సర్‌ పీజీ లేకపోవడంతో బయట ప్రాంతాల్లోని వైద్య కళాశాలలకు పరుగులు పెట్టాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది.

వేధిస్తున్న మందుల కొరత

కేన్సర్‌ వ్యాధికి వినియోగించే మందులు చాలా ఖరీదైనవి. ప్రస్తుతం రుయాస్పత్రిలో కేన్సర్‌ బాధితులకు అరకొరగానే మందులను అందిస్తున్నారు. మందులు ఖరీదు కావడంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వం బాధితులకు అందించలేకపోతోంది. దీంతో సగానికి పైగా మందులను పేద రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉన్న మందుల కొనుగోలు భారం తప్పడం లేదు.

ప్రస్తుతం కేన్సర్‌ వార్డు వివరాలు 
1
1/1

ప్రస్తుతం కేన్సర్‌ వార్డు వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement