నీలగిరి తైలం చెట్ల కూల్చివేత
ఏర్పేడు: మండలంలోని చిందేపల్లి రెవెన్యూ పరిధిలోని 5 ఎకరాల పట్టా భూమిలో సాగు చేస్తున్న నీలగిరి తైలం చెట్లు గురువారం రాత్రి నీలగిరి తైలం చెట్లు దౌర్జన్యంగా దున్నేసి చదును చేశారు. చిందేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 113–12 నుంచి 113–24 వరకు 4.99 ఎకరాలు డీకేటీ భూమి నాగంపల్లికి చెందిన కై లాసం చెంగారెడ్డి భార్య కె.రమణమ్మ పేరిట డీకేటీ పట్టా ఉంది. రెండేళ్ల కిందట ఆ పొలంలో నీలగిరి తైలం మొక్కలు నాటి సాగు చేసుకుంటున్నారు. అయితే తిరుపతికి చెందిన మున్సిపల్ ఉద్యోగి జ్యోతిరెడ్డి ఈ భూమిని చెంగారెడ్డి సోదరుడు మునికృష్ణారెడ్డి తనకు విక్రయించాడని, పొలాన్ని వదిలిపెట్టాలని బెదిరించేవాడన్నారు. అయితే గురువారం రాత్రి దౌర్జన్యంగా ట్రాక్టర్లు తీసుకొచ్చి రెండేళ్ల నుంచి సాగు చేస్తున్న నీలగిరి తైలం చెట్లను నేలమట్టం చేశారన్నారు. ఈ మేరకు బాధితులు మున్సిపల్ ఉద్యోగి జ్యోతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తిరుపతి కోర్టుకు హాజరైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి
తిరుపతి రూరల్: వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శుక్రవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌటింగ్ సెంటర్ వద్ద జరిగిన గొడవల్లో అక్రమంగా 36 మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడం, అదే కేసులో 37వ నిందితునిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చేర్చడం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వాయిదాకు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు, న్యాయమూర్తి కేసు వాయిదా వేయడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు. అనంతరం కోర్టు బయట మోహిత్ రెడ్డి మాట్లాడుతూ అక్రమంగా పెట్టిన కేసులో తనతో పాటు 37 మంది కోర్టుకు రావాల్సి వచ్చిందని, ప్రతిపక్షంలో ఇలాంటి అక్రమ కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. తనతోపాటు కోర్టుకు వచ్చిన వారందరికీ ధైర్యం చెప్పిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందరికీ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్
తిరుపతి సిటీ : జిల్లాలో మూడు రోజులుగా జేఈఈ మెయిన్స్ సెషన్–1 పరీక్షలు కొనసాగుతున్నాయని సిటీ ఏన్‌టీఏ కోర్డినేటర్ కై లాస్‌నాథ్ తెలిపారు. జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాలలో శుక్రవారం మూడవ రోజు జరిగిన పరీక్షకు 2111 మంది హాజరు కావాల్సి ఉండగా 2076 మంది హాజరైనట్లు చెప్పారు.
ఎరచ్రందనం కేసులో
ఒకరికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎరచ్రందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో తమిళనాడు, కృష్ణగిరి జిల్లాకు చెందిన మురుగన్‌కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్‌న్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక దళం సిబ్బంది 2017లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. నిందితుడు మురుగన్ అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించడాన్ని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించి, అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. మురుగన్‌పై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
అడ్మిషన్ పేరుతో రూ.5,65 లక్షల ఆన్‌లైన్ మోసం
తిరుపతి రూరల్: యూఎస్‌లో ఎంఎస్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తున్న ఓ మహిళను ఇన్‌స్ర్ట్రాగామ్‌లో ఓ ప్రకటన కపించడం, ఆ ప్రకటనలో పరిచయమైన ఫేక్ కోఆర్డినేటర్లు మెహ ర్, నితీష్, షేక్ సోనాకు అడ్మిషన్ తీసిస్తామని నమ్మించి రూ. 5,65,841 కాజేసిన ఘటన తి రుపతిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లి ఆమోగ్య విల్లా ట్రీ అపార్ట్‌మెంట్ బి బ్లాక్ 308లో నివసిస్తున్న 49ఏళ్ల ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేసి నగదు కాజేశారు. 2025 డిసెంబర్ నెలలో ఆమె కుమార్తె ఎంఎస్ చదు వుల నిమిత్తం యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇన్‌స్ట్రాగామ్‌లో ‘‘యాక్సలేరటెడ్ పా థ్ వే ప్రోగ్రాం ఫర్ ఎంఎస్’’ అనే ప్రకటన క నిపించింది. ఆ ప్రకటన ద్వారా సంప్రదించగా మెహర్, నితీష్. షేక్‌సోనాలు తాము అప్‌గ్రేడ్ కోఆర్డినేటర్లుగా పరిచయం చేసుకుని గూగుల్‌మీట్ ద్వారా వివరాలు తెలిపారు. సీట్ కన్ఫా ర్మ్ అయ్యిందని నమ్మించి వివిధ తేదీల్లో ఫోన్ పే, బ్యాంక్ ట్రాన్స్‌సెక్షన్, ఎడ్యుకేషన్ లోన్ ద్వారా 5,65,841 తీసుకున్నట్టు బాధితురాలు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ కు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు.
నీలగిరి తైలం చెట్ల కూల్చివేత


