పీటీసీలో మోటివేషన్‌పై శిక్షణ
న్యూస్‌రీల్
రూ.కోట్ల విలువచేసే భూమి ఆక్రమణ
1979లో పట్టాలు ఇచ్చారంటూ కూటమి నేతల హడావుడి
గత ప్రభుత్వ హయాంలో
నిర్మాణాలకు అనుమతించని వైనం
నేడు రంగంలోకి దిగిన తిరుపతి ఎమ్మెల్యే అనుచరులు
తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌కి
సమీపంలో నిర్మాణం
రెవెన్యూ రికార్డుల్లో కాలువ
పోరంబోకుగా నిర్ధారణ
చంద్రగిరి మండలంలోని పీటీసీలో మోటివేషన్ పై పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
●
బుధవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2026
కాలువ పొరంబోకులో పరదాల మాటున నిర్మిస్తున్న భవనం
అడిగేవారు లేరు.. అడ్డుకునే వారు రారని.. ఖాళీ జాగా కనిపిస్తే చాలు తమ ఖాతాలో వేసుకోవడానికి కొందరు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములపోయే..ఖాళీ స్థలాలు పోయే.. చివరకు కాలువపోరంబోకు స్థలాన్ని ఆక్రమార్కులు వదల్లేదు. తిరుపతి నగర నడిబొడ్డున ఇప్పుడలాంటి భూమిపైనే జనసేన, పచ్చనేతలు కన్నేశారు. తప్పుడు పట్టాలతో రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారులు వారికి సై అంటున్నారు.
నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు
తిరుపతి సిటీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరగనున్న జేఈఈ మెయిన్స్ సెషన్–1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న సెష న్–1 పరీక్షలు తిరుపతి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలలో జరగనున్నాయి. తిరుపతి ఎస్వీ జూపా ర్క్ సమీపంలోని ఇయాన్ డిజిటల్ సెంటర్, రేణిగుంట రోడ్డులోని చదలవాడ కళాశాలలో జరగనున్న పరీక్షలు రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒక్కొక్క సెషన్‌కు సుమారు 320 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ విద్యార్థి నేత చెంగల్‌రెడ్డికి నోటీసులు
తిరుపతిరూరల్: వైఎస్సార్ సీపీ విద్యార్థి విభా గం చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చెంగల్‌రెడ్డికి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన తి రుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా లో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరా యం కలిగించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి న పోలీసులు ఆ కేసులో విచారణకు హాజరుకావాలని 41 నోటీసులను మంగళవారం అందజే శారు. విద్యార్థి సంఘాలపై ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్నా చేసినందు కు మరో కేసు పెట్టడం దుర్మార్గమని, ఎన్ని కేసు లు పెట్టినా తమ పోరాటం ఆగదని అన్నారు.
నేడు చర్చాగోష్టి
తిరుపతి మంగళం : మంగళం రోడ్డులోని డీఎల్‌ఆర్ గ్రాండ్ హోటల్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మే ధావులతో చర్చాగోష్టి నిర్వహించనున్నట్టు రాయలసీమ అధ్యయన సంస్థ చైర్మన్ భూమన సుబ్రమణ్యం రెడ్డి తెలిపారు.
ఎయిడెడ్ స్కూళ్లల్లో టీచింగ్ పోస్టులకు 25న పరీక్షలు
తిరుపతి సిటీ: జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలలు, శ్రీ పొట్టి శ్రీరాములు అప్పర్‌ప్రైమరీ స్కూల్‌లో (ఎస్‌పీఎస్‌యూపీఎస్) ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 25, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జూపార్క్‌లోని ఇయాన్ డిజిటల్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. 25వ తేదీన గ్రేడ్–2 హిందీ పోస్టుకు, అదే రోజున గ్రేడ్–2 తెలుగు పోస్టుకు, 27వ తేదీని సెంకడరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు జరగనున్నా యని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్లను cre.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నడిబొడ్డున రూ.కోట్ల విలువచేసే కాలువ పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పది రోజుల క్రితం ముళ్లచెట్లను తొలగించి.. ఆ తరువాత తీరిగ్గా పక్కా భవన నిర్మాణం చేపడుతున్న విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ సమీపంలోని రామానుజ కూడలి పక్కన, గరుడ వారధి కింద సర్వే నంబర్ 43/1లో 2.40 ఎకరాలు కాలువ పోరంబోకు భూమి ఉంది. 1979లో రెండు సెంట్ల చొప్పున పది మందికి పట్టాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే కాలువ పోరంబోకు కావడం, వర్షం వస్తే వరద నీరు ప్రవహిస్తుండడంతో లబ్ధిదారులెవరూ నివాసాలను నిర్మించుకోలేదు. కొన్నేళ్ల తరువాత అక్కడ నిర్మాణాలు చేపట్టడం అంత యోగ్యం కాదని భావించి, అప్పటి ప్రభుత్వం ఆ భూమిని 22ఏ కింద చేర్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తిరుపతిలో అనేక నిర్మాణాలు 22ఏలోనే ఉన్నాయని స్థానికులు అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇదే విషయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతిలో నివాసాలు నిర్మించుకుని ఉన్న స్థలాలను 22ఏ నుంచి తొలగించమని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తిరుపతిలో అనేక మంది లబ్ధిపొందారు. ఖాళీగా ఉన్న భూములు మాత్రం ఇప్పటికీ 22ఏ లోనే ఉన్నాయి. 43/1లోని ఆ భూమి మొత్తం ముళ్లచెట్లతో నిండిపోయి ఉండేది. మూడేళ్ల కిందట అదే భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించగా గత ప్రభుత్వంలోని అధికారులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి అందులోకి ఎవరూ ప్రవేశించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం రూ. కోట్ల విలువచేసే కాలువ పోరంబోకు భూమిపై పడింది. మరో వైపు కార్వేటినగరం రాజులకు చెందిన వారు ఇదే భూమి కోసం తిరుపతికి వచ్చి విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇదే సర్వే నంబర్ 43/1 శ్రీకాళహస్తి నియోజక వర్గ పరిధిలో ఉందని తెలుసుకుని కార్వేటినగరం రాజులకు సంబంధించిన వారు వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన, టీడీపీ నేతలు ఈ భూమిని సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగారు.
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 79,098 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,083 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
పరిశ్రమల్లో కార్మికులకు భద్రత కల్పించాలి
తిరుపతి అర్బన్: పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సరైన భద్రత కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా పరిశ్రమల ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. చిన్న చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలు కేటాయించిసినట్లు తెలిపారు. మరోవైపు పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నవాటిని పరిశీలించి, అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ తిరుపతి విజయ భరత్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణారెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లోకనాథం, డీఆర్‌డీఏ ఏడీ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై మంగళవారం సాక్షి దినపత్రికలో వచ్చిన ’కొండలనూ మింగేస్తున్నారు’ కథనానికి స్పందించిన తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఆక్రమణ జరిగిన ప్రదేశాలను పరిశీలించి, మట్టి అక్రమ రవాణా చేసే రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. సర్వే నంబర్ 153లోని కొండను తవ్విన ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించేందుకు ప్రయత్నించిన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. ట్రాక్టర్లను మైనింగ్ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
కబ్జా.. అదో దర్జా!
ఆక్రమణలను తొలగిస్తాం
కాలువ పోరంబోకు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నట్లు నాకు ఇప్పుడే సమాచారం వచ్చింది. మా వాళ్లను పంపించి ఆక్రమణలను తొలగిస్తాం. కాలువ పోరంబోకు స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టటానికి వీల్లేదు.
– సురేష్ బాబు, అర్బన్ తహసీల్దార్, తిరుపతి
పీటీసీలో మోటివేషన్‌పై శిక్షణ
పీటీసీలో మోటివేషన్‌పై శిక్షణ
పీటీసీలో మోటివేషన్‌పై శిక్షణ
పీటీసీలో మోటివేషన్‌పై శిక్షణ
పీటీసీలో మోటివేషన్‌పై శిక్షణ


