ఇదేమిటి సర్వేశ్వరా?
రీసర్వేపై నాడు దుష్ప్రచారం.. నేడు సానుకూలత
వందేళ్ల పూర్వం భూ సర్వే.. ఫలితంగా పరిష్కారం కాని భూ సమస్యలు.. కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు.. వీటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది. దీనిపై అప్పటి ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు నానా రాద్ధాంతం.. అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు.. నేడు అదే రీసర్వేకు సానుకూలత వ్యక్తం చేస్తున్న సర్కారు.. ఇదేమిటి సర్వేశ్వరా.. నాడు మంచిది కాదన్నారు.. నేడు అదే అవలంభిస్తున్నారని రైతులు గుసగుసలాడుతున్నారు.
రీసర్వే జరిగిన గ్రామాలు
మండలం గ్రామం
కేవీబీపురం సుబ్రమణ్యపురం
పిచ్చాటూరు రామాపురం
నాగలాపురం వేలూరు
నారాయణవనం పాలమంగళం
వరదయ్యపాళెం యానాదివెట్టు
సత్యవేడు కాదిరివేడు
బీఎన్‌కండ్రిగ కేవీపురం
గత ప్రభుత్వంలో
రీసర్వే జరిగిన గ్రామాలు
మండలం గ్రామాలు
వరదయ్యపాళెం నెల్లటూరు, కోవూరుపాడు,
అయ్యవారిపాళెం
నాగలాపురం కృష్ణాపురం, కాళంజేరి
పిచ్చాటూరు రాజానగరం, అప్పంబట్టు
బీఎన్‌కండ్రిగ కంచనపుత్తూరు
సత్యవేడు: పేరడం, ఆంబాకం, మదనంజేరి, తొండుకొల్లి, సిరనంబూదూరు, మదనపాళెం, దళవాయి అగ్రహారం, చెంగంబాకం
నారాయణవనం: పాలమంగళం నార్త్, పాలమంగళం సౌత్, తుంబూరు, నైనారుకండ్రిగ, అరణ్యకండ్రిగ, కీలగరం, కసింమిట్ట, భీమునిచెరువు, డీకేపాళెం, ఇప్పన్‌తాంగల్, నారాయణవనం, తిరువట్యం, వీకేపాళెం, ఎరికంబట్టు, కళ్యాణపురం, బొప్పరాజుపాళెం
వరదయ్యపాళెం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేపై సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన, బీజేపీనేతలతో పాటు ఎల్లో మీడియా చేసి న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ సర్వేపై రైతులు, ప్రజల్లో అనేక సందేహాలు రేకెత్తించారు. అప్పట్లో ప్రతిపక్షనేత హోదాలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల బహిరంగ సభల్లో సమగ్ర భూ రీసర్వేను ఉద్దేశించి.. తమ్ము ళ్లు మీ భూములను జగన్‌మోహన్‌రెడ్డి లాగేసు కుంటున్నారు.. కూటమిని గెలిపిస్తే భూ రీసర్వే ను రద్దు చేస్తాం..మీ భూములను కాపాడుతాం అంటూ ఉన్నవి లేనివి కల్పించి ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ఎడపెడా కథనాలు ప్రచురించారు. ఏ సర్వేను అయి తే రద్దు చేస్తామని నాడు చంద్రబాబు, కూటమి నేతలు చెప్పారో అదే సర్వేని నేడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రారంభించడంతో ప్రజలు, రైతులు సర్వత్రా చర్చించుకుంటున్నారు.
వందేళ్ల తర్వాత సర్వే
రైతులు ఎన్నో ఏళ్లుగా భూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. భూమి ఒకరిది అయితే మరొకరి పేరున రికార్డులో నమోదు కావడం, సర్వే నంబర్లలో తప్పులు, సరిహద్దుల సమస్య, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికావడం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఏళ్లతరబడి తిరిగేవారు. జిల్లా స్థాయిలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమాల్లోనూ భూ సమస్యలపైనే అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవి. రైతులు ఏ అధికారి వద్దకు, ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా వారి భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమగ్ర భూరీసర్వేకు శ్రీకాారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో వందేళ్ల తర్వాత సమగ్ర భూ రీసర్వేను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం గురించి ఆలోచన చేయలేదు. సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో 2020లో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పేరుతో రాష్ట్రంలో మొదటి విడత సమగ్ర భూసర్వేను గత ప్రభుత్వం ప్రారంభించింది. మూడు దశలో 2023 జనవరి నాటికి సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వందలాది సర్వే బృందాలతో అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో సర్వే చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని 7 మండలాల్లో 170కి పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో మొదటి విడతగా కొన్ని గ్రామాల్లో గత ప్రభుత్వం రీసర్వే పూర్తి చేసింది. అయితే భూ రీసర్వేపై ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే టీడీపీ, జనసేన అగ్ర నాయకత్వం నుంచి కింది కేడర్ వరకు వారికి జతకడుతూ ఎల్లో మీడియా ఎంతో చెడు ప్రచారం చేసింది. ఒక విధంగా చెప్పాలంటే భూ రీసర్వే అంటే రైతులు భయపడేంతలా విషప్రచారం చేశారు. ఇంత స్థాయిలో వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఏపీ భూ రీసర్వే పేరుతో సర్వేను మళ్లీ ప్రారంభించారు. ఆ దిశగా నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 7 రెవెన్యూ గ్రామాల్లో భూ రీసర్వే ప్రక్రియను సర్వే సిబ్బంది గత ఏడాది ప్రారంభించారు. తదుపరి మండలానికి మూడు గ్రామాలను ఎంపిక చేసి తాజాగా సర్వే ప్రక్రియను మొదలుపెట్టారు. 2027 కల్లా అన్ని రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి కావాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేయడం గమనార్హం. సత్యవేడు నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి రీ సర్వే చేశారు.
సర్వే చేస్తున్నాం
వరదయ్యపాళెం మండలంలో ప్రస్తుతం రీసర్వే మొదలైంది. చిన్న పాండూరు, కువ్వాకొల్లి, కారిపాకం రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రక్రి య మొదలైంది. రీసర్వేను మొదలు పెట్టేందుకు మండల సర్వేయర్, ఇతర సర్వే బృందం సభ్యులు ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి పాసుపుస్తకాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. విడతలవారీగా కొన్ని రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసే ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచనల మేరకు 2027 కల్లా సర్వే ప్రక్రియను మండలంలో పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం.
– సుధీర్‌రెడ్డి, తహసీల్దార్, వరదయ్యపాళెం మండలం
ఇదేమిటి సర్వేశ్వరా?
ఇదేమిటి సర్వేశ్వరా?


