ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి
తిరుపతి అర్బన్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో ఆయన పలు విభాగాలకు చెందిన అధికారులతో కలసి ధా న్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో వరి పంట సాగు అధికంగా ఉండడంతో ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దళారీల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న రైతు సేవా కేంద్రాలకు వెళ్లి సంప్రదించాలని సూచించారు. మీ పరిధిలోని రైతు సేవా కేంద్రాలకు మాత్రమే వెళ్లాలని, అలాగే అక్కడే ఈ–పంట, ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలన్నారు. ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ రూ.2389కి, సాధారణ రకం క్వింటాల్ రూ.2369కి కొనుగోలు చేస్తారని వెల్లడించారు. సమస్యలుంటే పరిష్కారం కోసం పౌరసరఫరాల సంస్థ కంట్రోల్ రూమ్ నెంబర్ 8008901962కు ఫోన్ చేయాలని వివరించారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీఆర్వో నరసింహులు, సివిల్ సప్లయి జిల్లా మేనేజర్ బాలకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్‌రావు, మార్కెట్ కమిటీ జిల్లా అధికారి సురేంద్రబాబు, ప్రాథమిక సహకార సంఘం జిల్లా అధికారి నాగవర్థిని పాల్గొన్నారు.


