పోరు బాట తప్పదు
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు ప్రజల సొమ్మును వినియోగిస్తే బాబు సర్కారుపై పోరుబాట తప్పదు. విగ్రహ ప్రతిష్ట కేవలం టీడీపీకి చెందిన విషయం. వారి పార్టీ నిధులు, ఎన్‌టీఆర్ వారసుల డబ్బులతో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. అంతే కానీ, ప్రజలు పన్నుల రూపేణా కట్టిన సొమ్మును దుర్వినియోగం చేస్తే సహించం. ఒక్క విగ్రహానికి రూ.వేల కోట్లు ఖర్చు చేయాలనుకోవడం దుర్మార్గం. ఆ నగదును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు వాడితే ఉపయోకరం. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే మంచిది. – జ్యోతి, సీఐటీయూ, జిల్లా కార్యదర్శి, పూతలపట్టు
సర్కారు తీరు హాస్యాస్పదం
సర్కారు తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు నిధులు లేవని చేతులేత్తేసి, రూ.వేల కోట్లుతో ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పడంలో ఆంతర్యమేంటో పాలకులు వెల్లడించాలి. రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే వైద్యకళాశాలలు అందుబాటులోకి వస్తాయి. వేలాది మంది పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారు. ఇక విగ్రహం పెట్టాలనుకుంటే టీడీపీ ఫండ్ నుంచి నిధులు వెచ్చించుకోవాలి.
– విశ్వనాథ్, సీపీఐ నగర కార్యదర్శి, తిరుపతి
పోరు బాట తప్పదు


