వైభవంగా ఏటి పండగ
నాయుడుపేటటౌన్ : సంక్రాంతిని పురస్కరించుకుని నాయుడుపేటలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఏటి పండగ ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజున వేలాది మంది రావడంతో స్వర్ణముఖి నదీ తీరం జన సంద్రంగా మారింది. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కమిషనర్ షేక్ ఫజులుల్లా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. బంధుమిత్రులతో కలిసి నదీ తీరంలో సహపంక్తి భోజనాలు చేశారు. ఆటపాటలు, వినోద కార్యకమ్రాలతో సందడి చేశారు. తీరంలోని నీలకంఠేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, దుర్గా మల్లేశ్వరి దేవి ఆలయాలకు పోటెత్తారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఏటి పండుగ వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యాక్రమాలు ప్రజలను విఽశేషంగా ఆకట్టుతున్నాయి. ఆదివారం రాత్రి నిస్సీ ఈవెంట్ అర్గనైజర్ మేర్లపాక హరి అధ్వర్యంలో పలువురు బుల్లి తెర నటులు, స్థానిక యువకులతో చేిసిన నృత్యాలు అలరించాయి. నటులను కమిషనర్ సత్కరించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే విజయశ్రీ చేతులమీదుగా బహుమతులు అందించారు.
వైభవంగా ఏటి పండగ


