రద్దీ..రద్దీ
శ్రీకాళహస్తి: తై అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు క్యూ కట్టారు. సంక్రాంతి సెలవులు ముగింపు దశలో ఉండడంతో తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. 7,220 రాహుకేతు పూజలు జరిగినట్లు వెల్లడించారు.
దళారులతో తిప్పలు
ఆలయానికి వచ్చిన భక్తులకు దళారులు చుక్కలు చూపిస్తున్నారు. ఆదివారం 30 వేల మంది భక్తులు వచ్చినప్పటికీ అంతరాలయ దర్శనాలు 365 మాత్రమే జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దళారుల ఆధ్వర్యంలో అంతరాలయ దర్శనాలు వేలల్లో జరిగినట్టు తెలుస్తోంది. నాలుగు మాడవీధులు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద భారీ రద్దీ నెలకొనగా, పట్టణంలో వాహనాల రద్దీ కూడా పెరిగింది.
రద్దీ..రద్దీ


