హర్షిత్‌రెడ్డికి పోలీసుల నోటీసు
– 21న విచారణకు హాజరు కావాలని సూచన
తిరుపతి రూరల్: అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ఈనెల 9వ తేదీన విద్యార్థి సంఘాలు ధర్నా చేశాయి. ఆందోళనకు మద్దతుగా వెళ్లిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డితోపాటు మరో 14 మంది విద్యార్థి సంఘాల నేతలపై ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. 126(2), 292, 132టి/టీ3(5)బీఎన్‌ఎస్, 30 పోలీస్‌యాక్ట్–186 సెక్షన్ల పెట్టారు. ఆ కేసులో ఏ3గా ఉన్న చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి ఎస్వీయూ పోలీసులు 41 నోటీసు జారీ చేశారు. ఆదివారం ఈ మేరకు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటికి చేరుకుని ఈనెల21వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసు అందించారు. దీనిపై హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తూ పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. కేసులతో ఉద్యమాలను ఆపలేరని, విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మహాత్మా మన్నించు!
నాగలాపురం: నాగలాపురంలోని బజారు వీదిలో మహాత్ముని విగ్రహం వద్ద టీడీపీ నేతలు అనుచితంగా వ్యవహరించారు. ఎన్‌టీఆర్ వర్ధంతిని నిర్వహించే క్రమంలో గాంధీజీ విగ్రహాన్ని కమ్మేసేలా నేతలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతిపిత విగ్రహానికి అపచారం జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్టు వెళ్లిపోయారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాత్మాగాంధీనే గౌరవించని వారు ప్రజలకు ఏం ఒరగబెడుతారని మండిపడుతున్నారు.
హర్షిత్‌రెడ్డికి పోలీసుల నోటీసు


