వైభవంగా ముగిసిన ‘విరాసత్’
ఏర్పేడు : మండలంలోని జంగాలపల్లె సమీపంలో ఉన్న తిరుపతి ఐసర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన విరాసత్–2026 సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. వేడుకల్లో వివిధ ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులను ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. స్పిక్ మికాయ్ అనే సంస్థ సహకారంతో చేపట్టిన ఉత్సవాల్లో ఆదివారం భారతీయ శాసీ్త్రయ నృత్య కళాకారులు పద్మశ్రీ విద్వాన్ ఘనకాంత బోరా, డాక్టర్ అన్వేష మహంతా నృత్య ప్రదర్శనలు వీక్షకులను అబ్బురపరిచాయి. కార్యక్రమంలో ఐసర్ రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ పాల్గొన్నారు.
వైభవంగా ముగిసిన ‘విరాసత్’


