
రాష్ట్రంలో గంజాయి రాజ్యమేలుతోంది
వాకాడు: ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్యాయాలు, దౌర్జ న్యాలతో పాలన గాడి తప్పిందని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. సోమవా రం ఆయన వాకాడు ఎంపీపీ కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చాక గూడూరులో కొందరు విచ్ఛలవిడిగా ఇసుక తవ్వకాలు, మద్యం విక్రయాలు, గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారని, అయితే వారిని దండించాల్సిన స్థానిక ప్రజాప్రతినిఽధి వారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం దేనికి సంకేతమన్నారు. పులివెందులలో పోలింగ్ బూత్‌లను ఊరికి దూరంగా మార్చడం విచారకరమన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు కొడవలూరు దామోదర్‌రెడ్డి, సర్పంచులు భాస్కర్‌రెడ్డి, మధురెడ్డి, మాజీ ఎంపీపీ మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు.