
టీడీపీ నేతల ప్రోద్బలంతోనే మట్టి తవ్వకాలు
పెళ్లకూరు: మండలంలోని చిల్లకూరు మన్నేముత్తేరి చెరువులో యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపట్టి.. కోళ్లఫారం యాజమాన్యానికి పూర్తిగా సహకరించింది స్థానిక టీడీపీ నాయకులేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. కోళ్ల ఫారం నిర్మాణం తొలి దశ నుంచి యాజమాన్యం నుంచి ముడుపులు తీసుకుని టన్నుల కొద్దీ మట్టి తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకున్నట్లు విమర్శించారు. మూడు నెలలుగా పౌల్ట్రీ నిర్మాణ పనులు జరుగుతుంటే అధికార పార్టీలో ఉంటూ అడ్డుకోకుండా.. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నార ని ప్రశ్నించారు. గతంలో మూడు పర్యాయాలు టీడీపీ నాయకులే వెళ్లి మట్టి తవ్వకాలను అడ్డుకున్నప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఎందు కు ఫిర్యాదు చేయలేదన్నారు. ముడుపులు అందుకుంటే ఒక న్యాయం.. అడిగినంత ఇవ్వకపోతే మరో న్యా యమా? అని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల కోసం మాజీ సర్పంచ్ బసివిరెడ్డి వెంకటశేషారెడ్డి పదిహేనేళ్ల కిందట చెరువులో సిమెంట్ పైపులు వేసి తాత్కాలికంగా రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం గ్రావెల్‌తో రోడ్డు అభివృద్ధి చేసి పౌల్ట్రీ వద్దకు వాహనాల రాకపోకలకు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.