
గంగమ్మకు వెండి కవచాల విరాళం
రేణిగుంట: గంగ జాతర సందర్భంగా సోమవారం స్థానిక పాంచాలి నగర్‌కు చెందిన సూర్య ప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి అమ్మవారి మూలవిరాట్‌కు స్వర్ణ పూత వెండి కవచాలను అందజేశారు. దాత ఇంట్లో అమ్మవారి కవచాలకు విశేష పూజలు నిర్వహించి మేళతాళాలు నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆలయంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్ రెడ్డి, సభ్యులు స్వర్ణ పూత వెండి కవచాలను స్వీకరించారు. కార్యక్రమంలో సాయి మనోహర్, ధీరజ్ రెడ్డి, భరద్వాజ్ రెడ్డి, దినేష్, శరత్ బాబు, శివరాంరెడ్డి, హరిహర నాథ్ రెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.