
చిన్న సమస్యలను వాయిదా వేయొద్దు
● కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు 188 అర్జీలు ● పరిష్కారం చూపాలన్న జేసీ
తిరుపతి అర్బన్: ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 188 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలపై 108 అర్జీల ను అందుకున్నారు. జేసీతోపాటు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొందరు చిన్న చిన్న సమస్యల కోసం దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వస్తున్నారని తెలిపారు. వాటిని స్థానికంగానే పరిష్కరించాలని వెల్లడించారు. కొందరు చిన్న సమస్యలను సైతం పరిష్కరించకుండా వాయిదాలు వేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మురుగుపై నిర్మాణాలు
తిరుచానూరులోని 7వ వార్డు పరిధిలోని కొత్తవీధిలో ఉన్న పొన్న మురుగు కాలువపై స్థానికంగా ఏలుమలై రెడ్డి ఇంటిని నిర్మిస్తున్నారు. దాంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న అందరికీ ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని డీఆర్వో నరసింహులకు, డీపీఓ సుశీలాదేవికి వినతిపత్రాన్ని ఇచ్చాం.
– మునిరత్నం రెడ్డి, తిరుచానూరు