
జీలపాటూరులో విషాదం
పెళ్లకూరు: మండలంలోని జీలపాటూరు దళితవాడలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కత్తి గురవయ్య(42) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం గురవయ్య ఓ ప్రయివేట్ పరిశ్రమలో విధులు ముగించుకొని నాయుడుపేట చంద్రబాబునాయుడు కాలనీ సమీపంలో రోడ్డు పక్కన నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో ట్రాక్టర్ ఢీకొంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. స్థానిక సర్పంచ్, గ్రామ పెద్దలు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతునికి భార్య ధనమ్మ, కుమారులు లోకేష్, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు లింగమనాయుడుపల్లెకు చెందిన కోగిల జయరాం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఆయన బయలుదేరగా తొట్టంబేడు మండలం మల్లిగుంట వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం–కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కోగిల జయరామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీలపాటూరులో విషాదం

జీలపాటూరులో విషాదం

జీలపాటూరులో విషాదం