
12న ఆటో, టాక్సీ డ్రైవర్ల ఆందోళన
తిరుపతి కల్చరల్: ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆటో అండ్ టాక్సీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్.శివ డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ సర్కిల్లో నిరసన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. 12న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఉదయం 10 నుంచి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామన్నారు. ఆటో, టాక్సీ డ్రైవర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆటో, టాక్సీ యూనియన్ నేతలు సురేష్, పురుషోత్తంరెడ్డి, వెంకటేష్, రమేష్, ప్రమీల, పార్వతి, వాణిరెడ్డి, సతీష్, కాశి, భాస్కర నవీన్, లక్ష్మణ్ పాల్గొన్నారు.