
శ్రీసిటీలో వేడుకగా తిరంగా యాత్ర
శ్రీసిటీ (సత్యవేడు) : భారత సైనిక దళాల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘తిరంగా యాత్ర’ ఆదివారం శ్రీసిటీలో వేడుకగా జరిగింది. ఐఐఐటీ– శ్రీసిటీ, కియా విశ్వ విద్యాలయం, స్టేషన్–ఎస్ శ్రీసిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐఐఐటీ శ్రీ సిటీ ఆవరణ నుంచి యాత్ర ప్రారంభమై సెంట్రల్ ఎక్స్ ప్రెస్‌వే మీదుగా కొబెల్కో కూడలి వరకు కొనసాగింది. విద్యార్థులు, అధ్యాపకులు నివాసితులు త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి స్వేచ్ఛ, ఐక్యత, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ – శ్రీసిటీ మాజీ చైర్మన్ , స్ట్రాలినిటీ సంస్థ సీఈఓ బాల సుబ్రమణ్యం(బాల) ముఖ్య అతిథిగా హాజరై యాత్రలో జెండా ఊపి ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్‌ను విజయవంతం చేసిన భారత సాయుధ దళాల ధైర్యం, త్యాగానికి తగిన గౌరవంగా ఈ తిరంగా యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన సందేశంలో ఈ తరంగా యాత్ర తరువాత తరానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ శ్రీసిటీ రిజిస్ట్రార్ కల్నల్‌టి ఉమాశంకర్, కియా విశ్వవిద్యాలయం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ సత్యవరణ్, శ్రీనివాసులు రెడ్డి, శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్) రమేష్ కుమార్ పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్‌లో ఖాళీగా దర్శనమిస్తున్న ట్రాక్టర్లు