జెడ్పీటీసీ సభ్యురాలికి కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ సభ్యురాలికి కన్నీటి వీడ్కోలు

Aug 9 2025 8:40 AM | Updated on Aug 9 2025 8:40 AM

జెడ్ప

జెడ్పీటీసీ సభ్యురాలికి కన్నీటి వీడ్కోలు

● ఆమె భర్తను ఓదార్చిన జెడ్పీ చైర్మన్‌

డక్కిలి : డక్కిలి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు కలిమిలి రాజేశ్వరి అంతిమ యాత్ర అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, బంధువుల మధ్య శుక్రవారం ఆమె భర్త రామ్‌ప్రసాద్‌రెడ్డి స్వగ్రామం చాపలపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు వెంకటగిరి, రాపూరు, బాలాయపల్లి, సైదాపురం మండలాలకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు చాపలపల్లికి చేరుకుని రాజేశ్వరి భౌతిక కాయానికి నివాళుర్పించారు.

నివాళి అర్పించిన జడ్పీ చైర్మన్‌ దంపతులు

డక్కిలి జెడ్పీటీసీ కలిమిలి రాజేశ్వరి భౌతిక కాయాన్ని శుక్రవారం నెల్లూరు జెడ్పీ చైర్మన్‌ ఆనం అరుణమ్మ , విజయకుమార్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆమె భర్త రామ్‌ప్రసాద్‌రెడ్డిని ఓదార్చారు.

పలువురు పరామర్శ

జెడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి అనారోగ్యంతో మృతి చెందడంతో చాపలపల్లి గ్రామంలో ఆమె భర్త కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డిని పార్టీలకతీతంగా పలువురు ఓదార్చారు. పరామర్శించిన వారిలో డక్కిలి, బాలాయపల్లి, రాపూరు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు , నేతలు పాల్గొన్నారు.

కలిమిలి రాజేశ్వరికి ఘన నివాళి

వెంకటగిరి రూరల్‌ : డక్కిలి మండల జడ్పీటీసీ సభ్యురాలి రాజేశ్వరి మృతదేహానికి శుక్రవారం పలువురు నేతలు నివాళులర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్నేటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి రాజేశ్వరి మృతదేహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె భర్త రాంప్రసాద్‌రెడ్డిని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా వె వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ పులి ప్రసాద్‌రెడ్డి, వెంకటగిరి రూరల్‌ మండల, డక్కిలి మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, బాలాయపల్లి, డక్కిలి మండల ఎంపీపీ గూడూరు భాస్కర్‌రెడ్డి, గోను రాజశేఖర్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ సేతరాసిబాలయ్య, జిల్లా సంయుక్త సహాయకార్యదర్శి చిట్టేటి హరికృష్ణతో పాటు వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు నివాళి అర్పించారు.

జెడ్పీటీసీ సభ్యురాలికి కన్నీటి వీడ్కోలు 1
1/1

జెడ్పీటీసీ సభ్యురాలికి కన్నీటి వీడ్కోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement