
అక్రమంగా తరలిస్తున్న చేపల వాహనం పట్టివేత
కలువాయి (సైదాపురం) : కండలేరులో రాత్రివేళ అక్రమంగా చేపలు వేట సాగించి దాదాపు 500 కేజీల చేపలు తరలిస్తున్న బొలెరో వాహనాన్ని దాచూరు మత్స్యకారులు అడ్డుకున్నారు. చేపలు గుడ్డు దశలో ఉండడం వల్ల జూలై 1 నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు చేపల వేటను మత్స్యశాఖ అధికారులు నిషేధించింది. రాత్రి వేళల్లో అక్రమంగా వేట సాగించి బొలేరో వాహనంలో చేపలు అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో స్థానిక మత్స్యకారులు అడ్డగించి ఏడీ చాంద్‌బాషాకు జరిగిన సంఘటనను స్థానిక మత్స్యకారులు తెలియజేశారు. అయితే ఏడీ స్పందించి వెంటనే పట్టుకున్న ప్రదేశంలో చేపలను మత్సశాఖ అధికారి సురేష్ ద్వారా వేలంపాట నిర్వహించారు. 12 వేలకు అదే గ్రామానికి చెందిన మత్స్యకారుల పాట పాడుకున్నారు. నిషేధిత సమయంలో ఎవరైనా చేపలు వేట సాగిస్తే చర్యలు తప్పవని ఏడీ చాంద్‌బాషా తెలిపారు.