
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు వేగవంతం చేయాలి
తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డీఈఓ కేవీఎన్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖాధికారి చాంబర్‌లో జిల్లాలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల సమన్వనయకర్తలతో సమావేశమై అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థుల వివరాలను సేకరించి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు కల్పించాలన్నారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు కూడా రెగ్యులర్ పాఠశాల సర్టిఫికెట్లతో సమానమైనన్న విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు.