
టీటీడీ నేత కబ్జాలో ఆలయ మాన్యం..!
● పంగూరు దళితవాడ వాసుల ఆందోళన ● రాజకీయ అందదండలతో టీటీపీ నేతకు పట్టా ● పట్టా రద్దు చేసి మాన్యాన్ని పరిరక్షించాలని దళితుల డిమాండ్
ఏర్పేడు:మండలంలో పాగాలి గ్రామ సమీపంలో ని రాములువారి ఆలయ మాన్యాన్ని టీటీడీ నేతలు కాజేసేందుకు యత్నిస్తున్నారని, దీనిని పరిరక్షించాలని కోరుతూ మండలంలోని పంగూరు దళితవాడవాసులు ఆందోళన చేశారు. గురువారం ఆలయ మాన్యం వద్ద పంగూరు దళితవాడ వాసులు సుమారు 100మంది చేరుకుని ఆ భూమిలోని మొక్కలను జేసీబీతో తొలగించారు. వారు మాట్లాడుతూ, పేద దళితులమైన తమకు పాగాలి రెవెన్యూ పరిధిలో 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఎకరం చొప్పున వ్యవసాయ భూమిని పంపిణీ చేసి తామందరినీ సన్నకారు రైతులుగా మార్చారన్నారు. ఆ భూముల్లో కొంత మిగులు భూమి సర్వే నంబరు 205–4లో 2.09 ఎకరాలను తామంతా దేవుడి మాన్యంగా గ్రామ అవసరాల నిమిత్తం వినియోగించుకుంటున్నామన్నారు. అయితే పాగాలికి చెందిన టీడీపీ నాయకుడు సతీమణి మామండూరు మునెమ్మ పేరుతో ఈ భూమిలో అక్రమంగా పట్టాలు పొంది, ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసుకునేందుకు యత్నిస్తున్నారని, రాజకీయ అండతో భూస్వాములు పొందిన పట్టాను రద్దు చేసి తమ దేవుని మాన్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తహసీల్దార్ భార్గవి వివరణ కోరగా, తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
కల్తీ..కల్తీ
తిరుపతి క్రైమ్: నగరంలో ఫుడ్ సేఫ్టీ, తూ నికలు కొలతల శాఖ అధికారులు సంయుక్త గురువారం రెస్టారెంట్లపై మెరు పు దాడులు నిర్వహించారు. ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశాల మేరకు.. జాయింట్ ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో 18 బృందాలుగా అధికారులు విడిపోయి, నగరంలోని 36 రెస్టారెంట్లు, బార్లను తనిఖీ చేశారు. ఇందులో 35 రెస్టారెంట్లలో శ్యాంపిళ్లు సేకరించారు. హోటళ్లు, బార్లలో చాలాచోట్ల అసభ్యంగా కనిపించడంతో వా రందరికీ నోటీసులు జారీచేశారు. నిల్వ ఉంచి పాడైపోయిన 26 కేజీల ఆహార ప దార్థాలను ధ్వంసం చేశారు. 4 హోటళ్లపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా 14 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీచేశారు.

టీటీడీ నేత కబ్జాలో ఆలయ మాన్యం..!

టీటీడీ నేత కబ్జాలో ఆలయ మాన్యం..!