
వరలక్ష్మీవ్రతానికి ఏర్పాట్లు పూర్తి
● భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్‌లు
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహణకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం సా యంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. సుమారు 500 మందికి పైగా మహిళలు టికెట్లు కొనుగోలు చేసి ఆస్థాన మండపంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొననున్నారు.
ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ఏర్పాటు
వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాలని ఇప్పటికే టీటీడీ యాజమాన్యం అధికారులను ఆదేశించింది. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధం చేసుకోవడంతోపాటు, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన బృందాలను సైతం ఏర్పాటు చేస్తున్నా రు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలు ఏ ర్పాటు చేశారు.
750 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం
చిల్లకూరు: గూడూరు పట్టణంలోని ఆస్పత్రి రోడ్డులో ఉన్న ఓ మెడికల్ షాపులో చేపట్టిన తనిఖీల్లో సుమారు 750 గ్రాముల డ్రగ్స్ ఉండగా గుర్తించి, స్వాదీనం చేసుకుని యజమానిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో డ్రగ్స్ దొరకడం దానికి యువతను ఆకర్షితులు చేసేలా షాపు యజమాని కొంత కాలంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. మత్తుకు బానిసలుగా మార్చేలా అతి తక్కువతో దొరికే పలు రకాల నిషేధిత మందులను, సాధారణ మందులతో పాటు తెప్పించి విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.