
జెడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి మృతి
డక్కిలి: డక్కిలి జెడ్పీటీసీ సభ్యురాలు కలిమిలి రాజేశ్వరి గురువారం ఆనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మృత దేహాన్ని వెంటగిరి పట్టణంలోని కాలేజీమిట్టలో ఉన్న స్వగృహంలో ప్రజల సందర్శన కోసం గురువారం ఉంచి శుక్రవారం స్వగ్రామం అయిన డక్కిలి మండలం చాపలపల్లి గ్రామానికి తీసుకు వస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు. మృతురాలు రాజేశ్వరి వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సీనియర్ నాయకుడు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి. ఆమె 2013లో చాపలపల్లి పంచాయతీకి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా గెలుపొందారు. అనంతరం 2021సంవత్సరంలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆమె డక్కిలి మండలం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. జెడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి మృతి చెందడంతో చాపలపల్లిలో విషాద చాయులు అలుముకున్నాయి.
వెంకటగిరికి చేరిన రాజేశ్వరి మృతదేహం
వెంకటగిరి రూరల్: డక్కిలి జెడ్పీటీసీ సభ్యురాలు కలిమిలి రాజేశ్వరి మృతదేహం బుధవారం రాత్రి వెంకటగిరిలోని కలిమిలి నివాసానికి తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నేతలు రాజేశ్వరి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డికి పలువురి పరామర్శ..
కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి సతీమణి రాజేశ్వరి మృతికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డితోపాటు తిరుపతి, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రముఖ రాజకీయనాయకులు దిగ్రాంతి వ్యక్తం చేశారు. కలిమిలి రాంప్రసాద్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు. కలిమిలి కుటుంబానికి దేవుని మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు.