
నూతన బ్యాగుల పంపిణీ
వరదయ్యపాళెం: విద్యార్థులకు కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన స్కూల్ బ్యాగులు చిరిగిపోవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాల గురించి ఈ నెల 6వ తేదీన మిత్ర ఖేదం అన్న కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందిస్తూ సంబంధిత పాండూరు పాఠశాలలో చిరిగిన బ్యాగులకు బదులుగా విద్యార్థులకు నూతన బ్యాగులను పంపిణీ చేయాలని పాండూరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మునిసుబ్రమణ్యం బుధవారం బ్యాగులు చిరిగిన విద్యార్థులను గుర్తించి మరోసారి నూతన బ్యాగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. సాక్షి చొరవపై విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.
చిరిగిన బ్యాగులపై స్పందించిన విద్యాశాఖ

నూతన బ్యాగుల పంపిణీ

నూతన బ్యాగుల పంపిణీ