
గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు
చంద్రగిరి: అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు చైన్నెకు సమీపంలోని పెరియమేడుకు చెందిన భరత్, తిరువళ్లూరు జిల్లా పెరియవక్కం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా దామినేడు సమీపంలోని ఇందిరమ్మ గృహాల వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, మంగళవారం అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఈక్రమంలో రాజేంద్ర అనే వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో గొంతుకోసుకోవడానికి యత్నించడంతో పోలీసులు అడ్డుపడి, అదుపులోకి తీసుకున్నారు. ఆపై వారి వద్ద నుంచి రెండు గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించి, తమదైన శైలిలో విచారించారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీంతో వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి కేసులో ఇద్దరి అరెస్టు