అంతర్‌జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు వర్సిటీ విద్యా
తిరుపతి రూరల్: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈనెల 29 నుండి 31వ తేదీ వరకు జరగనున్న సీనియర్ అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు ఎంపికయ్యారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళలు, పురుషుల జట్లు ఎంపికల్లో మహిళావర్సిటీకి చెందిన పి యామిని (డీఈడీ), వై తేజస్విని (ఎల్‌ఎల్‌బీ), ఎం మాలతి (బి ఫార్మసీ), బి. చంద్రిక (బీఫార్మసీ) విద్యార్థిను ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ వ్యాయామ విద్య విభాగాధిపతి ప్రొఫెసర్. జి.సారా సరోజినీ, యూనివర్సిటీ బీసీ ఆచార్య వి.ఉమ, రిజిస్టార్ ఎన్. రజినీ గురువారం విద్యార్థినులను అభినందించారు.

అంతర్‌జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు వర్సిటీ విద్యా

అంతర్‌జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు వర్సిటీ విద్యా

అంతర్‌జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు వర్సిటీ విద్యా