
వెంకన్న పాదాల చెంత మద్యధార
ప్రతి క్షణం ధ్వనించే గోవింద నామస్మరణ.. వెల్లివిరిసే భక్తిభావం.. ఆ ప్రాంతం ఆధ్మాత్మి క నిలయం..అద్యంతం వేంకటేశ్వరుడిపైనే అందరి ధ్యాస.. ఆ ఏరియా మొత్తం మద్యం, మాంసం నిషేధిత ప్రాంతం.. అయినా అక్కడా అల్లరి మూకలు.. అసాంఘిక శక్తులు చెలరేగుతున్నాయి. తమ మద్యపానానికి అడ్డాగా మార్చుకున్నాయి. ఫలితంగా యథేచ్ఛగా మద్యం ఏరులై పారుతోంది. ఇదెక్కడో కాదు..నిత్యం గోవింద నామస్మరణలతో మారుమోగే ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ టీటీడీ ఓల్డ్ చెక్ పాయింట్ పార్కింగ్ స్థలం. ఇక్కడికి బయట ప్రాంతాల నుంచి భక్తులు వివిధ వాహనాల్లో వచ్చి అలిపిరి కాలినడకన తిరుమలకు నడిచి వెళ్లే క్రమంలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు టీటీడీ పార్కింగ్ ఏర్పాటు చేసింది. అయితే ఈ పార్కింగ్ ప్రాంతంలో ఎటు చూసినా మద్యం బాటిళ్లే దర్శనమిస్తున్నాయి. కూసవేటు దూరంలోనే టీటీడీ భద్రతా కార్యాలయంతోపాటు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి చూస్తే వాటి పనితీరుపై అనుమానాలు వస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి
మద్యం బాటిళ్లను
చూస్తున్న భక్తులు

వెంకన్న పాదాల చెంత మద్యధార

వెంకన్న పాదాల చెంత మద్యధార

వెంకన్న పాదాల చెంత మద్యధార

వెంకన్న పాదాల చెంత మద్యధార

వెంకన్న పాదాల చెంత మద్యధార

వెంకన్న పాదాల చెంత మద్యధార

వెంకన్న పాదాల చెంత మద్యధార